మాజీ మంత్రి కి బెయిల్ మంజూరు

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కు బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తుంది.ఒక హత్యకేసులో ఏ 4 నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర కు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది.

 Bail Granted To Ex Minister Kollu Ravindra , Moka Bhaskar Rao Murder Case, Moka-TeluguStop.com

ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు లో శిక్ష అనుభవిస్తుండగా ఆయన బెయిల్ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు.దీనితో మచిలీపట్టణం కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసినట్లు తెలుస్తుంది.28 రోజులు విజయవాడలోనే ఉండాలి అని, సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉండాలి, నలుగురితో కలవకూడదు ఇలా మొత్తం దాదాపు ఒక 15 షరతులు విధించి మరీ కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది.మోకా భాస్కర్ రావు హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర రాజమండ్రి జైలు లోనే ఉంటున్నారు.

అయితే తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడం తో రేపు రాజమండ్రి జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తుంది.వైసీపీ నేత మోకా భాస్కర్ రావు ను ఇద్దరు యువకులు బందరు మార్కెట్ లో దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.

అయితే వైసీపీ నేత పేర్ని నాని కి మోకా ముఖ్య అనుచరుడు కావడం తో అతడి హత్య కేసు విచారణను వైసీపీ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది.అయితే ఈ కేసులో ముఖ్యులు అయిన ఆ ఇద్దరు యువకులను సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయగా, విచారణలో చిన్నా అనే టీడీపీ నేత పేరు వినిపించింది.

అయితే 2013 లో సంపత్ హత్య జరిగిన దానికి ప్రతీకారం గానే మోకా భాస్కర్ రావు ను దారుణంగా హతమార్చినట్లు వెల్లడైంది.

అయితే టీడీపీ నేత చిన్నా పేరు వినిపించడం తో అతడిని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా కొల్లు రవీంద్ర పేరు వినిపించింది.

దీనితో జులై లో పోలీసులు కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేసి ఈ హత్య కేసులో ఏ4 నిందితుడిగా చేర్చారు.గత కొద్దీ రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలు లోనే జైలు శిక్ష అనుభవిస్తున్న కొల్లు రవీంద్ర కు మచిలీపట్నం కోర్టు తాజాగా షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube