టీడీపీ కి ఝలక్ ఇచ్చిన మాజీ మంత్రి, పార్టీ పై అసంతృప్తి

ఒకపక్క స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ పార్టీ కి మాజీ మంత్రిడొక్కా మాణిక్యవరప్రసాద్ ఝలక్ ఇచ్చారు.ఒకపక్క స్థానిక ఎన్నికల్లో వైసీపీ ని పక్కా ప్లానింగ్ తో ఎదుర్కోవాలని టీడీపీ చూస్తుంటే ఇలా సీనియర్ నేత,మాజీ మంత్రి పార్టీ ని వీడుతుండడం మరింత ఇబ్బందికి గురి చేస్తుంది.

 Ex Minister Dokka Manikya Vara Prasad Resigns To Tdp Party-TeluguStop.com

అయితే పార్టీ పై అసంతృప్తి తోనే డొక్కా పార్టీ కి రాజీనామా చేఇస్సానట్లు తెలుస్తుంది.ఈ మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది.

గతేడాది జరిగిన ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని కానీ చివరి నిమిషంలో తనకు ప్రత్తిపాడు సీటు కేటాయించారంటూ లేఖ లో డొక్కా అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తే ఓడిపోతానని తెలిసినప్పటికీ కూడా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకున్నట్లు డొక్కా పేర్కొన్నారు.

అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో శాసన మండలి సమావేశాలు వివాదాస్పదం అవుతాయని ఊహించే సభకు కూడా హాజరుకాలేదని ఆయన తెలిపారు.అయితే మరోపక్క కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి కూడా టీడీపీ కి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం.

త్వరలోనే సైకిల్ కి గుడ్ బై చెప్పేసి వైసీపీ కండువా కప్పుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో కూడా భేటీ అయిన సందర్భంలో పార్టీ వీడనున్నట్లు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే పార్టీలో చేరమని వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.త్వరలోనే అధినేత జగన్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం.మొత్తానికి మాజీ మంత్రులు పార్టీ కి గుడ్ బై చెప్పనుండడం తో స్థానిక ఎన్నికలకు ముందు టీడీపీ ఇరకాటంలో పడనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube