మహా మంత్రి గారికి కూడా కరోనా,టెన్షన్ లో మహా సర్కార్  

Ex Maharashtra Cm Ashok Chavan Test Positive - Telugu Corona Virus, Ex-maharashtra Cm Ashok Chavan, Former Cm Ashok Chavan Tests Positive, Maharastra

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.ఈ మహమ్మారి వల్ల దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్ర కకావికలం అయిపోతుంది.

 Ex Maharashtra Cm Ashok Chavan Test Positive

ఇప్పటికే ఆ రాష్ట్రంలో 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన విషయం విదితమే.అయితే తాజాగా ఈ కరోనా మహమ్మారి మాజీ సీఎం,ప్రస్తుత మంత్రి అశోక్ చవాన్ ను కూడా తాకినట్లు తెలుస్తుంది.

ఆయన ప్రస్తుతం సీఎం ఉద్దవ్ థాక్రే కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్న చవాన్ గత కొన్ని రోజులుగా తరచూ అనారోగ్యానికి గురిఅవుతున్నారు.దీనితో అనుమానం కలిగి పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.

మహా మంత్రి గారికి కూడా కరోనా,టెన్షన్ లో మహా సర్కార్-General-Telugu-Telugu Tollywood Photo Image

అధికారిక పనుల నిమిత్తం ఆయన తరచూ స్వగ్రామం నుంచి ముంబై ప్రయాణిస్తూ ఉంటూ,దారిలో చాలా మందిని కలుస్తూ ఉండడం తో ఈ వైరస్ సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.అయితే మాజీ సీఎం కు కరోనా పాజిటివ్ రావడం తో ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

దీనితో వెంటనే ఆయనకు సొంత ఊరిలోనే ఐసోలేషన్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.కుటుంబ సభ్యులు, సన్నిహితులను క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వెల్లడించారు.మరోవైపు ఈ విషయం తెలిసిన ఆయన పేషీలో పని చేసే అధికారులు కంగారు పడుతున్నారు.మంత్రికి సన్నిహితంగా ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.కాగా మహారాష్ట్ర కేబినెట్‌లో ఇద్దరికి పాజిటివ్ అని తేలినట్టైంది.

ఇంతకు ముందు ఎన్సీపీ నేత జితేంద్ర అహ్వాద్‌ వైరస్ బారిన పడగా, తాజాగా అశోక్ చవాన్‌ కు కూడా ఈ వైరస్ సోకడం విశేషం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ex Maharashtra Cm Ashok Chavan Test Positive Related Telugu News,Photos/Pics,Images..

footer-test