రాజ్యసభకి జేడీ లక్ష్మీనారాయణ... జనసేన పొత్తుతో బీజేపీ ప్లాన్  

Ex Jd Lakshminarayana Comments On Janasena-bjp Alliance-ex Jd Lakshminarayana Comments,janasena-bjp Alliance,tdp,ysrcp

జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయిలో ప్రజలలో మంచి వ్యక్తిత్వం ఉన్న లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.రాజకీయాలలో వచ్చి ప్రజా సేవ చేయడానికి తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ ఎన్నికల అన్ని పార్టీలు అతనిని ఆహ్వానించాయి.

EX JD Lakshminarayana Comments On Janasena-BJP Alliance-Ex Jd Janasena-bjp Alliance Tdp Ysrcp

అయితే ఊహించని విధంగా అతను మాత్రం పవన్ వెంట నడవడానికి ఇష్టపడి జనసేన పార్టీలో చేరారు.ఆయినా చేరిన వెంటనే విశాఖ పార్లమెంట్ సీటు కూడా కన్ఫర్మ్ చేశారు.

అక్కడ జేడీ ఎలా కచ్చితంగా గెలుస్తారని అందరూ భావించారు.అయితే భాగానే ఓట్లు వచ్చిన ఊహించిన స్థాయిలో గెలవలేకపోయారు.


ఎన్నికల తర్వాత ఎక్కువగా తన ట్రస్ట్ తరుపున సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్య ఉంటున్న జేడీ జనసేన పార్టీ కార్యక్రమాలకి కొంత దూరం ఉన్నారు.దీంతో అతను జనసేన పార్టీని వీడుతారనే ఊహాగానాలు వినిపించాయి.

అయితే వీటిని లక్ష్మీనారాయణ కొట్టిపాడేసారు.తన అవసరం పార్టీకి ఉన్నంత వరకు జనసేనలోనే ఉంటానని స్పష్టం చేశారు.

అదే సమయంలో పార్టీలో ఉన్నంత మాత్రాన అధినాయుకుడుని అంటి పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదని, పవన్ కళ్యాణ్ కి, తనకి క్లారిటీ ఉందని, మా ఆలోచనలు కలిసాయని, ఇద్దరు అదే పనిగా కలవాల్సిన అవసరం లేదని చెప్పి తాను అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదని నిరూపించుకున్నారు.ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుంచి జేడీ లక్ష్మీనారాయణని బీజేపీ రాజ్యసభ పంపించే ఆలోచనలో ఉందనే టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికికి కూడా బీజేపీ పెద్దలు తీసుకెళ్ళినట్లు చెప్పుకుంటున్నారు.పవన్ కూడా ఈ నిర్ణయంకి ఒకే చెప్పే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలలో తెలుస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీసియాల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

.

తాజా వార్తలు

Ex Jd Lakshminarayana Comments On Janasena-bjp Alliance-ex Jd Lakshminarayana Comments,janasena-bjp Alliance,tdp,ysrcp Related....