లక్ష్మినారాయణ బాండ్ పేపర్ మేనిఫెస్టో! ఏపీలో సంచలనం

ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలు అన్ని కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలని ఉగాది సందర్భంగా ఈ రోజు విడుదల చేసాయి.ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసారు.

 Ex Jd Lakshmi Narayana Bond Paper Manifesto-TeluguStop.com

ఇందులో సంక్షేమ పథకాలు అమలుతో పాటు, రైతులకి సంక్షేమానికి పెద్ద పీట వేసే విధంగా హామీలు ఇచ్చారు.అలాగే మద్యపానాన్ని మూడు దశల్లో పూర్తిగా నిషేధించి కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కే పరిమితం చేయడం, పంట రాబడికి ముందే కనీస గిట్టుబాటు ధర ప్రకటించడం, అలాగే మహిళల సంక్షేమానికి రుణాల మాఫీకి జగన్ తన మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసారు.ఇందులో ఎక్కువగా కులాల వారీగా కార్పోరేషన్ లు, అలాగే గ్రామీల ప్రాంతాలలో పేదలకి పక్కా ఏళ్ళు ఏర్పాటుతో, డిసెంబర్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయడం, అలాగే రైతుల సంక్షేమం, బీచ్ కారిడార్, ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకి పెద్ద పీట వేస్తూ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే జనసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయగా తాజాగా విశాఖ ఎంపీగా మాజీ జేడీ లక్ష్మినారాయణ తన మేనిఫెస్టో ని రిలీజ్ చేసారు.విశాఖ అభివృద్ధికి తాను ఎలా ముందుకి వెళ్తున్న అనే విషయాలని మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్ మీద మేనిఫెస్టో హామీలు రాసి విడుదల చేసారు.విశాఖని క్లీన్, గ్రీన్ సిటీగా ఉంచడంతో పాటు మాఫియా రహిత నగరంగా నిలబెడతా అని లక్ష్మినారాయణ హామీ ఇచ్చారు.ఇప్పుడు విశాఖ జనసేన ఎంపీ అభ్యర్ధిగా ఉన్న లక్ష్మినారాయణ బాండ్ పేపర్ హామీలు ఇప్పుడు రాజకీయాలలో సంచలనంగా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube