ప్రియుడుతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న నటికి మాజీ ప్రియురాలు స్ట్రాంగ్ వార్నింగ్.. అతను నా వాడు అంటూ!

సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు తమ వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తారు.ముఖ్యంగా తమ పెళ్లి, ప్రేమ విషయాల్లో మాత్రం బాగా వార్తల్లో నిలుస్తారు.

 Ex Girlfriend Strong Warning To Actress Who Got Engaged With Boyfriend , Rakhi Sawant, Marrige, Boy Friend, Ex Grilfriend,dancer, Adil Durrani ,ritesh,hindi Bigg Boss Reality Show-TeluguStop.com

చాలా మంది సెలబ్రెటీలు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని మళ్లీ వదిలేసి మరొకర్ని పెళ్లి చేసుకొని వారితో కూడా బ్రేకప్ అవుతూ ఉంటారు.మరికొందరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వ్యక్తులను పెళ్లి చేసుకొని వాళ్ల మాజీ భార్యలతో కూడా గొడవ పడుతుంటారు.

ఇలా ఇప్పటికీ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు బాగా మీడియా ముందుకు వచ్చాయి.ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ కి సంబంధించిన విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.

 Ex Girlfriend Strong Warning To Actress Who Got Engaged With Boyfriend , Rakhi Sawant, Marrige, Boy Friend, Ex Grilfriend,Dancer, Adil Durrani ,Ritesh,Hindi Bigg Boss Reality Show-ప్రియుడుతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న నటికి మాజీ ప్రియురాలు స్ట్రాంగ్ వార్నింగ్.. అతను నా వాడు అంటూ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.

బాలీవుడ్ సినీ, టెలివిజన్ నటి రాఖీ సావంత్ గురించి అందరికీ పరిచయమే.

నటిగానే కాకుండా డాన్సర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.అంతేకాకుండా ఆమె హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నది.

చివరి వరకు పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో తెగ పంచుకుంటుంది.

ఇక ఆమె ఎన్నో స్పెషల్ సాంగ్ లలో హాట్ లుక్ లో కనిపించగా.

ఆమెకు ఐటమ్ గర్ల్, ఐటెం బాంబ్ అనే పేరు కూడా పెట్టారు.ఈమె గతంలో బ్రిటన్ కు చెందిన రితేష్ అనే ఒక వ్యాపార వేత్తను రహస్యంగా వివాహం చేసుకుంది.

ఆ సమయంలో ఆమె బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.అతనితో విడిపోయిన అనంతరమే మరో బిజినెస్ మాన్ తో లవ్ ట్రాక్ నడిపింది.

అంతేకాకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు తెలిసింది.ఇక అతడి పేరు అదిల్ దురానీ.అతడు తన కంటే ఆరేళ్ల చిన్నవాడు.ఇక అతడు బీఎండబ్ల్యూ కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు.పైగా గతంలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని బీ టౌన్ లో వార్తలు కూడా వినిపించాయి.ఇక అతడితో ఏడు అడుగులు వేద్దామనుకుంటున్న రాఖీ సావంత్ కు ఒక చిక్కు ఎదురయింది.

తనకు ఒక అమ్మాయి నుండి ఫోన్ కాల్ రావడంతో.తను అదిల్ ప్రేయసిని.అతడు తన వాడని.అతడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వార్నింగ్ ఇచ్చిందట.

అతడితో నాలుగేళ్లలో రిలేషన్ లో ఉన్నానని.అతడు ఎప్పటికీ తన వాడే అని అన్నదట.

ఇక ఆ మాటలు విని రాఖీ షాక్ అవ్వగా వెంటనే అతడిని నిలదీసిందట.

దాంతో అతడు ఆమెతో ప్రేమలో పడడం నిజమే అని.కాకపోతే అది గతంలో అని.ఆమెతో ఎప్పుడో బ్రేకప్ అయ్యిందని అన్నాడట.ఇక ఈ విషయం గురించి రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో తెలుపుతూ ఆమె అతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చింది.అంతేకాకుండా అతడిని త్వరలో పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube