ఏపీ కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం..అధ్యక్షుడిగా మాజీ సీఎం

జవసత్వాలు అన్నీ మారిపోయి బక్క చిక్కిపోయిన కాంగ్రెస్ ని నేను కాపాడుతాను అంటూ వస్తున్నారు ఒక సీనియర్ నేత.నా ఎంట్రీ తో కాంగ్రెస్ లో మళ్ళీ జీవం పుట్టుకొస్తుంది అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు.

 Ex Cm Nallari Kiran Kumar Reddy To Re Join Congress Party-TeluguStop.com

గత ఎన్నికల్లో ఏపీ ప్రజల చేతుల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోను అధికారానికి దూరం రెండు రాష్ట్రాలలో అధికారానికి దూరం అయ్యింది అయితే.తెలంగాణలో టీఆర్ఎస్ తో దెబ్బా దెబ్బా గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో మాత్రం కోలుకునే పరిస్థితిలో లేదు.

అయితే ఈ తరుణంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నింపడానికి కాంగ్రెస్ అధిష్టానం నూతన అధ్యక్షుడిని తెరమీదకి తీసుకువస్తోంది.

ఆ నూతన అధ్యక్షడు ఎవరో కాదు మాజీ సీఎం నల్లారి కిరణ కుమార్ రెడ్డి.మంగళవారం నాడు ఇదే విషయమై కిరణ్ కుమార్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు భేటీ అయ్యారు.కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పళ్లంరాజు కిరణ్‌కుమార్ రెడ్డిని ఆహ్వానించారు…అంతేకాదు ఈ క్రమంలోనే కిరణ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఉమెన్ చాందీతో సమావేశం కానున్నారు.

అయితే కిరణ్ కుమార్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని ఉమెన్ చాందీ పల్లం రాజుకు భాద్యతలు అప్పగించారు.

అంతేకాదు కిరణ కుమార్ రెడ్డి కి గురువుగా భావించే చిదంబరం సైతం కాంగ్రెస్ లోకి రమ్మనమని సూచించారట.

దాంతో కిరణ్ కుమార్ రెడ్డి రాక లాంచానమే అని తెలుస్తోంది.అయితే ఇటీవల కాలంలో ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారనే ప్రచారం కూడ సాగుతోంది.

ఈ తరుణంలో ఏపీలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే కిరణ్‌తో సంప్రదింపులు జరిపారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.అయితే ఏపీలో వైసీపిని టార్గెట్ చేయడం ద్వారా మాత్రమే మనం మళ్ళీ ఏపీలో ఉనికిని సాధించవచ్చు అని కిరణ్ అన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఇప్పటికే రాహుల్ సైతం ఏపీలో వైసీపిని టార్గెట్ చేయండి అని చెప్పడం అందరికి తెలిసిందే…అయితే ఇది కిరణ్‌తో మంతనాల ప్రభావమేనని తెలుస్తోంది…అయితే కిరణ్ ఏపీ రాజకీయాలపై దృష్టి సారిస్తారా లేక జాతీయ స్థాయి రాజకీయాలలో ఉంటారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు మరోపక్క కాంగ్రీ అధిష్టానం మాత్రం కిరణ్ కమార్ రెడ్డి ఏపీలో భాద్యతలు తీసుకుంటే అన్ని ఏపీలో కాంగ్రెస్ కి నూతన ఉత్తేజం వస్తుందని భావిస్తున్నారు.మరి కిరణ కుమార్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube