సుప్రీం కోర్టు మెట్లెక్కిన 'సీబీఐ' రగడ  

Ex Cbi Chief Alok Varma Filed Petition Suprem Court-

సీబీఐ కు తాత్కాలిక డైరెక్టర్‌ను నియమించి, తనను సెలువుపై పంపించడంపై ఆ సంస్థ డైరెక్టర్ అలోక్ వర్మ బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో అలోక్ వర్మ పిటిషన్ వేశారు..

సుప్రీం కోర్టు మెట్లెక్కిన 'సీబీఐ' రగడ -Ex Cbi Chief Alok Varma Filed Petition Suprem Court

ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్‌ సారథ్యంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. అయితే అక్టోబర్ 26న అలోక్ వర్మ పిటిషన్‌ను విచారిస్తామని వెల్లడించింది.

వర్మ తరఫున న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. వర్మతో పాటు స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాను కేంద్ర ప్రభుత్వం సెలవుపై బయటకు పంపిందని, దీనివల్ల పలు కేసుల్లో విచారణకు విఘాతం ఏర్పడుతుందని గోపాల్ సుప్రీం కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉన్నత సంస్థలకు డైరెక్టర్లుగా, డైరెక్టర్ జనరళ్లుగా నియమితులైనవారి కనీస పదవీ కాలం రెండేళ్లుగా ఉండేలా గతంలో సుప్రీం కోర్టు మార్గనిర్దేశం చేసిందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దానికి కూడా విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

వర్మ పదవీకాలం ఇంకో రెండు నెలలు ఉందని, అలాంటప్పుడు ప్రభుత్వం మధ్యలో తొలగించడానికి వీల్లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా. అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానా మధ్య అంతర్గత యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వారిద్దరినీ ప్రభుత్వం సెలవులపై పంపింది.