పాండ్య పై ఒత్తిడి తీసుకురావద్దు అంటున్న మాజీ కెప్టెన్

మిండియా అల్రౌండర్ హార్దిక్ పాండ్య ను సహజంగానే ఆడనివ్వమని,అతడిపై ఒత్తడి తీసుకు రావద్దు అంటూ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.ప్రపంచ కప్ దగ్గర పడుతుండడం తో సీనియర్ ప్లేయర్స్ తమకు తోచిన సలహాలు వారు జూనియర్స్ ఇస్తున్నారు.

 Ex Captain Says Dont Give Stress On Hardik Pandya1-TeluguStop.com

ఈ క్రమంలోనే కపిల్ తాజాగా టీమిండియా గురించి మాట్లాడుతూ అనుభవజ్ఞులు,యువకులతో సమతూకంగా ఉండడమే టీమిండియా బలమని వ్యాఖ్యానించారు.అలానే ధోనీ,కోహ్లీ లు జట్టులో ఉండడం మరింత కలిసొచ్చే అంశం.

భారత్ ఖచ్చితంగా టాప్ 4 లో నిలుస్తుంది అని అయితే విజేతగా ఏ జట్టు నిలుస్తుందో అన్న విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేమని కపిల్ అన్నారు.భారత్,ఇంగ్లాండ్,ఆస్ట్రేలియా ఖచ్చితంగా సెమీస్ కు చేరతాయని కపిల్ జోస్యం చెప్పారు.

పాండ్య పై ఒత్తిడి తీసుకురావద�

అయితే నాలుగో బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా పోటీ పడే చాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు.అలానే టీమ్ లో పాండ్య ఉండడం ప్లస్ అవుతుంది అని, బుమ్రా, షమీ కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నారని అన్నారు.టీమ్ లో వీరిద్దరూ కూడా కీలకమని కపిల్ అభిప్రాయపడ్డారు.వన్డే వరల్డ్ కప్ లో భాగంగా జూన్ 5 న టీమిండియా తోలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తో తలపడనున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube