విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతుళ్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల భామలు శృతి హాసన్, అక్షర హాసన్.శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది.
హీరోయిన్ గా రాణిస్తుంది.అయితే చిన్న కూతురు అక్షర హాసన్ మాత్రం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కాలేకపోయింది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు.ఏదో అప్పుడప్పుడు ఏదో ఒకటి అర సినిమా అన్నట్లు కనిపించి మాయమవుతుంది.
అయితే ఈ అమ్మడు సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఎఫైర్స్ తో హాట్ టాపిక్ గా ఉంటుంది.గతంలో ఓ సారి ఈమె ప్రైవేట్ ఫోటోలు బయటకి వచ్చాయి.
ఆ సమయంలో వాటికి సంబంధించి కొద్దిగా ఇష్యూ కూడా అయ్యింది.తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఆ ఫోటో లని లీక్ చేసాడని ఆరోపణలు కూడా వినిపించాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ తనూజ్ వీర్వాణి మీడియా ఇంటర్వ్యూలో అక్షర హసన్ తో డేటింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
తామిద్దరం నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్నామని ఇష్ట ప్రకారమే కొన్నేళ్ల క్రితం విడిపోయామని తనూజ్ అంతే కాకుండా 2018లో అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు ఆన్లైన్లో లీక్ కావడంపై ఆయన మొదటిసారి స్పందించారు.డేటింగ్లో వున్న అమ్మాయి గురించి బయటకు చెప్పడం నాకస్సలు నచ్చదని వీర్వాణి చెప్పాడు. అక్షర హాసన్‌తో విడిపోయిన తర్వాత కూడా చాలా సార్లు కలిశామని, పార్టీలకు సైతం వెళ్లామని గుర్తుచేసుకున్నాడు.
అలా మేమిద్దరం స్నేహితులమయ్యామని వీర్వాణి చెప్పాడు.అంతేకాకుండా బాయ్‌ఫ్రెండ్‌ని కూడా అక్షర తనకు పరిచయం చేసిందని నేనూ తన గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేశానని తనూజ్ పేర్కొన్నాడు.