ప్రేయసి పై మాజీ ప్రియుడి దురాగతం.. !

Ex Boyfriend Atrocity On Girlfriend

ప్రేమ కొందరి పాలిట వరమైతే, మరి కొందరికి శాపమై వెంటాడి వేటాడుతుంది.అసలు ఎందుకు ప్రేమించామురా దేవుడా అనేలా చేస్తుంది.

 Ex Boyfriend Atrocity On Girlfriend-TeluguStop.com

ఒకప్పటి ప్రేమలు ప్రాణం పోసేలా నిజాయితీగా ఉండేవి.కానీ నేటి సమాజంలో ప్రేమలు, ప్రేమించిన పాపానికి కుటుంబ పరువుతో పాటు ప్రాణాలు కూడా తీస్తున్నాయి.

ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌ శివారులోని గుర్రంగూడలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.

 Ex Boyfriend Atrocity On Girlfriend-ప్రేయసి పై మాజీ ప్రియుడి దురాగతం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని మీర్‌పేట్‌ పీఎస్ పరిధిలో ఉన్న గుర్రంగూడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ యువతి గతంలో ఒక వ్యక్తితో ప్రేమలో పడింది.కాగా కొన్ని కారణాల వల్ల ఆ యువకుడికి దూరంగా ఉంటుందట.

అయితే తనను ఇలా ప్రేమించిన యువతి దూరం పెట్టడం సహించలేని ఆ యువకుడు ప్రియురాలిపై పగను పెంచుకున్నాడట.

ఈ క్రమంలోనే మాజీ ప్రియురాలు ఇంటికి వెళ్లిన మాజీ ప్రియుడు రాహుల్ గొడ్డలితో దాడికి పాల్పడిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడట.

కాగా తీవ్రంగా గాయపడిన ఆ యువతి పరిస్థితి విషమంగా మారిందని సమాచారం.ఇక ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం రంగంలోకి దిగారట.

#Gurranguda #Girlfriend #Boyfriend #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube