నరేంద్ర మోడీ పై ఆర్మీ మాజీ సైనికుడి పోటీ..టికెట్ ఇచ్చిన సమాజ్ వాదీ పార్టీ...

ప్రధాని మోడీ పోటీ చేసే వారణాసి లోక్ శాభ స్థానం గురించి గత ఎన్నికల అప్పుడు కూడా తీవ్రమైన చర్చలు జరిగాయి , నరేంద్ర మోడీ కి ఎంత మెజారిటీ వస్తుంది అని కాదు నరేంద్ర మోడీ ప్రత్యర్థి గా ఎవరు పోటీ చేస్తున్నారు అని.2014 లో జరిగిన ఎన్నికలలో వారణాసి లో నరేంద్ర మోడీ కి ప్రత్యర్థి గా ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసింది తెలిసిందే.అప్పుడు మోడీ కి 5.80 లక్షల ఓట్లు రాగా , కేజ్రీవాల్ కి 2.10 లక్షల ఓట్లు వచ్చాయి.అయితే ఈ సారి సమాజ్ వాదీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది ఏకంగా మాజీ ఇండియన్ ఆర్మీ జవాన్ ని పోటీకి నిలిపింది.
వారణాసి లోక్ శాభ స్థానానికి ముందుగా సమాజ్ వాదీ పార్టీ షాలిని యాదవ్ ని పోటీకి నిలుపుదాం అనుకుంది , చివరి క్షణాలలో వారణాసిలో మోదీపై పోటీచేసే అభ్యర్థిని అనూహ్యంగా మార్చింది.షాలినీ యాదవ్ స్థానంలో బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు టికెట్ ఇచ్చి ఆ వెంటనే బీఫారం అందజేశారు.

 Ex Army Soldier Against Modi-TeluguStop.com

అయితే వారణాసి లో నామినేసషన్ వేయడానికి చివరి తేదీ నిన్ననే కాబట్టి హడావిడిగా తేజ్ బహదూర్ నామినేషన్ వేసారు .వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాద్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తేజ్ బహదూర్ పోటీచేస్తున్నారు.ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ తీసుకున్న ఈ సంచలన విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
గతంలో బీఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేసిన తేజ్ బహదూర్ జవాన్ గా ఉన్నప్పుడు ఇండియన్ ఆర్మీపై సంచలన ఆరోపణలు చేశారు.

జవాన్ లకు వడ్డించే ఆహార నాణ్యత విషయం లో వీడియో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం తో అతని పైన కేంద్రం ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకొని 2017లో అతడిని విధుల నుంచి తొలగించింది.ప్రస్తుతం నామినేషన్ దాఖలు చేసిన తేజ్ బహదూర్ తన గెలుపు పైన ధీమాగా ఉన్నానని తెలిపాడు.

తనకు ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ అండదండలతో పాటు సుమారు పది వేల మంది రిటైర్డ్ సైనికుల మద్దతు ఉందని స్పష్టంచేశారు.
సమాజ్‌వాద్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశంసించారు.

ఓ వైపు దేశ కోసం పోరాడిన జవాన్, మరోవైపు జవాన్లను ఉద్యోగాలను తొలగిస్తున్న మోదీ ఉన్నారని.వారణాసిలో టఫ్ ఫైట్ నెలకొందని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం భారత మాజీ జవాన్ తేజ్ బహదూర్ పోటీతో వారణాసి లో పోరు చౌకీదార్ vs జవాన్‌ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube