మోడీపై పోటీకి సై అంటున్న మాజీ జవాన్! సంచలన వాఖ్యలతో వార్తల్లోకి

గతంలో జవాన్లకు సరైన ఆహారం ఇవ్వడం లేదంటూ సోషల్‌మీడియాలో వీడియో పోస్టు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పారా మిలటరీ జవాన్ తేజ్ బహదూర్‌ గురించి అందరికి తెలిసే ఉంటుంది.అయితే అలా వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడంపై సీరియస్ అయిన సీనియర్ అధికారులు అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు.

 Ex Army Jawan Ready Contest On Pm Modi In Elections-TeluguStop.com

తరువాత అతను ఎక్కడ ఉన్నాడు అనే విషయం చాలా మంది మరిచిపోయారు.హరియాణాలోని రేవారి ప్రాంతానికి చెందిన బహదూర్‌ మళ్ళీ తాజాగా వార్తల్లోకి వచ్చాడు.
st రానున్న ఎన్నికల్లో ప్రధాని మోదీపై తాను పోటీ చేసేందుకు సిద్ధమయ్యా అని బహుదూర్ ప్రకటించాడు.ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు చెప్పగానే చాలా రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని, అయితే తాను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని బహుదూర్ వెల్లడించారు.

ఈ ఎన్నికలలో గెలుపు ఓటమి గురించి తాను ఆలోచించడం లేదని, ప్రధాని మోడీ ఆర్మీ విజయాల్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు, ఈ ఐదేళ్ళ కాలంలో రక్షణ శాఖ విషయంలో మోడీ వైఫల్యాలు ఎత్తి చూపించడానికి తాను పోటీ చేస్తున్నా అని బహుదూర్ చెప్పుకొచ్చాడు.పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోతే కనీసం వారికి అమరుల హోదా కూడా మోడీ ఇవ్వలేదని బహదూర్‌ చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube