నేను వైఎస్ మంచి మిత్రులం అని తెలిపిన బాబు  

Ys Rajashekar Reddy Is My Best Frriend Says Chandrababu-

కొన్ని కొన్ని సార్లు అసెంబ్లీ లో చర్చలు రసాభాసగా జరుగుతుండగా,మరికొన్ని సార్లు వినోదభరితంగా కొనసాగుతూ ఉంటాయి.అలాంటి ఒక ఘటన అసెంబ్లీ లో చోటుచేసుకుంది.నిన్నటివరకు నువ్వంటే నువ్వంటూ సాగిన చర్చలో ఈ రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలచుకున్నారు.అసెంబ్లీ లో అక్రమ కట్టడాల కూల్చివేత పై జరుగుతున్న చర్చలో భాగంగా వైఎస్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని బాబు గుర్తుచేసుకున్నారు.

Ys Rajashekar Reddy Is My Best Frriend Says Chandrababu- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Ys Rajashekar Reddy Is My Best Frriend Says Chandrababu--YS Rajashekar Reddy Is My Best Frriend Says Chandrababu-

చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి.ఆ విషయానికి వస్తే రోడ్లుపై ఎక్కడికక్కడ పెట్టిన వైఎస్ విగ్రహాలు కూడా అక్రమమే వాటిని కూల్చివేస్తారా? అని అంటూ బాబు ఘాటుగా ప్రశ్నించడం తో సభలో కొంత సేపు గందరగోళం నెలకొంది.నాకు, వైఎస్‌కు మధ్య రాజకీయ వైరుద్యం ఉంది తప్పితే.వ్యక్తిగత కక్షలు లేవని, కేవలం మేము పార్టీలు మాత్రమే మారాం నేను టీడీపీలోకి వచ్చా కానీ ఆయన మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు.సభలో ఉన్నంతవరకే ప్రత్యర్థులం విడిగా మంచి స్నేహం ఉంది ఇద్దరం మంత్రులుగా ఒకే రూమ్ లో పడుకున్నాం అంటూ బాబు ఆ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

Ys Rajashekar Reddy Is My Best Frriend Says Chandrababu- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Ys Rajashekar Reddy Is My Best Frriend Says Chandrababu--YS Rajashekar Reddy Is My Best Frriend Says Chandrababu-

కానీ, ఇప్పటి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బాబు అన్నారు.వైఎస్ తనకు ఎంత మంచి స్నేహితుడో సీఎం జగన్‌కు తెలియకపోవచ్చని వ్యాఖ్యానించారు మరోపక్క అధికార పక్షం కూడా ఏమాత్రం వదలకుండా చంద్రబాబుకు వైఎస్సే టికెట్ ఇప్పించారంటూ సెటైర్లు వేశారు.దీనిపై స్పందించిన చంద్రబాబు ఎవరు.ఎవరికి టిక్కెట్టు ఇప్పించారో అందరికీ తెలుసని అన్నీ తెలిసిన వైఎస్ చనిపోయారని వ్యాఖ్యానించారు.