బాలయ్య ఎలాంటి వాడో చెప్పేసిన ఈవివి సత్యనారాయణ..?

Evv Sathyanarayana Talking About Balakrishna

ఇ.వి.వి గా ప్రసిద్ధిచెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ తెలుగు సినిమా దర్శకుడు.తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఈయన దర్శకుడు జంధ్యాల శిష్యుడు.

 Evv Sathyanarayana Talking About Balakrishna-TeluguStop.com

మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా చెవిలో పువ్వు చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు.

కొద్ది కాలం తర్వాత నిర్మాత రామానాయుడు ప్రేమఖైదీ చిత్రంలో అవకాశమిచ్చారు.ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి.

 Evv Sathyanarayana Talking About Balakrishna-బాలయ్య ఎలాంటి వాడో చెప్పేసిన ఈవివి సత్యనారాయణ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించి మంచి పేరును తెచ్చుకున్నారు.

ఈవీవీ సత్యనారాయణ ఇంటర్వ్యూ సందర్భంలో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో బయటపెట్టారు.

సినిమా షూటింగ్స్ లో బాలకృష్ణ డౌన్ టు ఎర్త్ ఉంటాడని ఈవీవీ సత్యనారాయణ అన్నారు.అంత ఫాలోయింగ్, అంతా క్రేజ్ ఉన్న హీరో అయినా కూడా చాలా మర్యాదగా నడుచుకుంటాడని ఈవీవీ తెలిపారు.

బాలకృష్ణ 8 గంటలకు షూటింగ్ అంటే 7 గంటలకే వచ్చి కూర్చుంటాడు అని ఈవీవీ చెప్పారు.

ఇక పోతే అప్పట్లో జరిగిన ఒక సంఘటనను గురించి ఈవీవీ ఇలా చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Balayya, Director Evv, Evv About Balayya, Evv Sathyanarayana, Nandamuri Balakrishna, Tollywood, Veerabhadra Movie Shooting-Movie

బాలకృష్ణ గారి సినిమా వీరభద్ర షూటింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్ళమని ఆయన అన్నారు.ఒక సాంగ్ షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళినపుడు, అందులో ఒక బెంగాలీ అమ్మాయి హీరోయిన్ గా నటించింది.ఆ అమ్మాయి సడెన్ గా మా నాన్న గారికి సీరియస్ గా ఉంది వెళ్లిపోవాలి అని చెప్పి లగేజ్ సర్దుకొని రెడీ అయిందని ఆయన చెప్పారు.నైట్ షూటింగ్ అయింది.

అందరం పడుకున్నాం.మార్నింగ్ అయ్యేసరికి ఆ అమ్మాయి వచ్చి నేను ఇండియా వెళ్ళాలి అని బ్యాగుతో వచ్చేసిందని ఆయన అన్నారు.

Telugu Balakrishna, Balayya, Director Evv, Evv About Balayya, Evv Sathyanarayana, Nandamuri Balakrishna, Tollywood, Veerabhadra Movie Shooting-Movie

అదేంటి ఇప్పుడు వెళితే ఎలా, షూటింగ్ కోసం ఇంత దూరం వచ్చాం, హీరో కూడా ఉన్నారు.ఇప్పుడు ఇలా వెళితే ఎంత నష్టం అని ఎంత చెప్పినా వినలేదని ఆయన తెలిపారు.ఆఖరికి వాల్ల నాన్న ఏం పర్లేదు షూటింగ్ అయిపోయాకే రమ్మని చెప్పడంతో ఆ అమ్మాయి నిర్ణయం మార్చుకుంది అని ఈవీవీ చెప్పారు.నిజానికి ఆ టైం లో బాలకృష్ణ గారికి కోపం రావాలి కానీ.

ఆ తర్వాత నష్టపోయేది మేమే కాబట్టి ఓపికతో ఉన్నారని ఆయన వివరించారు.

#Veerabhadra #Balakrishna #Evv Balayya #Evv #Balayya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube