దేశంలో మొదటి సారి అక్కడ మహిళల కోసం ప్రత్యేకం.. మగాళ్లు మరింత కష్టాలు పడక తప్పదా?

ఆడవారు అన్ని రంగాల్లో దూసుకు పోతున్న ఈ సమయంలో వారికి సమాన ప్రాముఖ్యత ఇచ్చేందుకు అన్ని రంగాల్లో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇప్పటికే ఇండియాలో ఆడవారికి ఉద్యోగాలు మరియు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్‌ను కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Evp Carnival Cinemas Pink Parking Spaces For Women-TeluguStop.com

పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన చర్చ జరుగుతుంది.బస్సుల్లో, జాబ్స్‌లో ఇలా అన్ని చోట్ల కూడా ఆడవారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు, సదుపాయాలు చేస్తూ ఉన్నారు.

రైల్లలో మరియు బస్సుల్లో వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నప్పుడు పార్కింగ్‌లో ఎందుకు ఉండకూడదని చెన్నైకి చెందిన ఒక మల్టీప్లెక్స్‌ యాజమాన్యం భావించింది.

చెన్నైలోని ఈవీపి కార్నివాల్‌ సినిమా వారు పింక్‌ పార్కింగ్‌ అంటూ ఏర్పాటు చేసింది.

బండ్లు వేసుకుని వచ్చే ఆడవారి పార్కింగ్‌ కోసం ఆ స్థలం కేటాయించడం జరిగింది.పురుషులతో పాటు సమానంగా ఆడవారు బండ్లతో వస్తున్న సమయంలో పురుషుల బండ్ల పక్కన పెట్టడం, వాటిని తీసే సమయంలో ఇబ్బంది పడటం జరుగుతుంది.

అందుకే ఈవీసీ వారు తమ కొత్త మల్టీప్లెక్స్‌లో పింక్‌ పార్కింగ్‌ పేరుతో ఆడవారికి మాత్రమే అంటూ పార్కింగ్‌ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు.ఈవీసీ వారి ఆలోచన త్వరలోనే అందరికి వచ్చే అవకాశం ఉంది.

అన్ని మల్టీప్లెక్స్‌లు మరియు ఏరియాల్లో పింక్‌ పార్కింగ్‌ లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఈ ఐడియాకు మహిళలోకం ఫిదా అవుతున్నారు.తమకోసం పార్కింగ్‌ను కూడా ఏర్పాటు చేసిన ఈవీసీ కార్నివాల్‌ సంస్థ వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు.ఇదే మాదిరిగా అన్ని చోట్ల కూడా పార్కింగ్‌లో మహిళలకు ప్రాముఖ్యత ఇస్తే మాత్రం మగాళ్లకు మరింత కష్టం తప్పదని జోకులు పేలుతున్నాయి.

మరో వైపు సినిమా థియేటర్‌లో పార్కింగ్‌లో రిజర్వేషన్‌ ఇచ్చిన వారు టికెట్ల విషయంలో కూడా ఆడవారికి రిజర్వేషన్‌ ఇవ్వాలని కొందరు కామెంట్‌ చేస్తున్నారు.మొత్తానికి దేశంలోనే మొదటి పింక్‌ పార్కింగ్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పింక్‌ పార్కింగ్‌ ఏరియాలు ఎప్పుడు వస్తాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube