పోలింగ్ లో ఎందుకంత గందరగోళం! నేతల అసంతృప్తిలో అసలు నిజం  

ఏపీ ఎన్నికలలో కూడా ఈవీఎంల గందరగోళం తప్పలేదు. .

Evms Problems In Andhra Pradesh Elections-bjp,election Commission,evms Problems,tdp

  • ఒకప్పుడు ఎన్నికలలో పోలింగ్ అంటే బ్యాలెట్ బాక్స్ లు మాత్రమే ఉండేవి. అయితే బ్యాలెట్ బాక్స్ ల ద్వారా ఎక్కువగా రిగ్గింగ్ జరుగుతున్నాయని విమర్శలు వచ్చిన నేపధ్యంలో టెక్నాలజీ ఉపయోగించుకొని కొత్తగా ఈవీఎం యంత్రాలని ఇండియన్ ఎలక్షన్ కమిషన్ న్దుబాతులోకి తీసుకొచ్చింది.

  • పోలింగ్ లో ఎందుకంత గందరగోళం! నేతల అసంతృప్తిలో అసలు నిజం-EVMs Problems In Andhra Pradesh Elections

  • అయితే ఈ ఈవీఎంల మీద మొదటి నుంచి చాలా రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలలో ఈవీఎంల వాడకం అంత మంచిది కాదని విమర్శలు వినిపించాయి.

  • ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియని తారుమారు చేయొచ్చని, హాక్ చేసి పార్టీ గెలుపు ఓటములని మార్చేయవచ్చని చాలా మంది వాదిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎంల టాంపరింగ్ సాధ్యం కాదని, ఇప్పటికే చాలా సార్లు అలా టాంపరింగ్ చేస్తామని చెప్పి విఫలం అయ్యారని చెప్పుకొచ్చింది.

  • EVMs Problems In Andhra Pradesh Elections-Bjp Election Commission Evms Tdp

    కానీ ఎన్నికలు జరిగిన ప్రతి సారి కూడా ఈవీఎంల కారణంగా ఓటు వేయడానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఓటు వేసే క్రమంలో ఒక పార్టీ బటన్ మీద ప్రెస్ చేస్తే వేరొక పార్టీకి ఓటు పడటం, అలాగే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం వంటి కారణాల వలన పోలింగ్ కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఎన్నికలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.

  • అయితే ఈవీఎంల మొరాయింపుపై రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న కూడా ఎన్నికల సంఘం మాత్రం ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం.