రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కు సర్వం సిద్ధం.. !

తెలంగాణ రాష్ట్రంలో రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.త్రిముఖ పోరుగా సాగుతున్న ఈ ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్టంగా తీసుకున్న విషయం తెలిసిందే.

 Everything-is-ready-for-tomorrow-mlc-election-voting- Telangana, Mlc, Election,-TeluguStop.com

ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతలైతే ఈ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల్లా భావిస్తున్నారనే టాక్ వస్తుంది.

ఇకపోతే రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ స్థానంతో పాటు, హైదరాబాద్,‌ రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.

ఇక రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ 164 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఈసారి 1,685 జంబో బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు.కాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై, అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్‌ అధికారులతో పాటుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ కూడా సమీక్షిస్తున్నారు.

Telugu Graduates, Telangana, Tomorrow-Latest News - Telugu

ఇదిలా ఉండగా పోలింగ్‌ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పూర్తిస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయనున్నారు.ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకుని, భౌతిక దూరం పాటించాలని అధికారులు పేర్కొంటున్నారు.ఆయితే ఓటర్లు, ఓటరు స్లిప్ తోపాటు, ఏదైనా గుర్తింపు కార్డును తప్పని సరిగ్గా వారి వెంట తీసుకెళ్లాలి.ఇక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని వీడియోగ్రఫీ తీయనున్నారని వెల్లడిస్తున్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube