ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం మొత్తం ముస్తాబువుతోంది.ఇప్పటికే రాష్ట్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు సిద్ధం చేసుకున్నాయి.

 Delhi, Red Fort, Independence Day, Celebrations-TeluguStop.com

పంద్రాగస్టు వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోటలో కూడా పనులు పూర్తయ్యాయి.శనివారం తెల్లవారుజామున దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతారు.ఈ మేరకు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో కేంద్రం రక్షణ బలగాలను దింపింది.

ఇప్పటికే రక్షణ శాఖ ఎర్రకోట పరిసర ప్రాంతాలను తన ఆధీనంలో తీసుకుంది.ఎర్రకోట బాధ్యతలు అన్ని పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి.మోదీ ప్రసంగాన్ని ప్రజలు వినేందుకు అధికారులు ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.ప్రధాని జెండా ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ప్రదేశాన్ని బుల్లెట్ ఫ్రూప్ తో ఏర్పాటు చేశారు.

కరోనా నేపథ్యంలో కేవలం 5 వేల మందిని మాత్రమే స్వాతంత్ర్య దినోత్సవానికి హాజరు కానున్నట్లు సమాచారం.కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరం పాటించే విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బలగాలు చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటికే సమీప ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ జరిపాయి.

కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా ఏర్పాటు ముగిశాయి.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు తెల్లవారుజామున జెండాను ఎగురవేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube