వైసీపీలో అంతా ష్‌.. గ‌ప్‌చుప్‌.. ఆ పేరెత్తొద్దు ?

అధికార వైసీపీలో చిత్ర‌మైన చ‌ర్చ సాగుతోంది.ప్ర‌స్తుతం సాగుతున్న కార్పొరేష‌న్‌, మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లో టీడీపీ మేనిఫెస్టో విడుద‌ల చేసింది.

 Everything In Ycp Gapchup Dont Say That Name-TeluguStop.com

ఐదు రూపాయాల‌కు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ల‌ను తిరిగి తెరుస్తామ ‌ని.ప‌న్నులు ర‌ద్దు చేస్తామ‌ని, మంచి నీటి కుళాయి క‌నెక్ష‌న్లు.ఫ్రీగా ఇస్తామ‌ని.ఇలా అనేక హామీల‌తో టీడీపీ రెండు పేజీల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది.అయితే.ఇది ఏమేర‌కు ప్ర‌భావం చూపుతుంద‌నేది ప‌క్క‌న పెడితే.

ఈ విష‌యంలో టీడీపీలో క‌న్నా.వైసీపీలోనే ఎక్కువ‌గా చ‌ర్చ‌నీయాంశం అయింది.

 Everything In Ycp Gapchup Dont Say That Name-వైసీపీలో అంతా ష్‌.. గ‌ప్‌చుప్‌.. ఆ పేరెత్తొద్దు -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

“అన్నా.ఇదేంది.మ‌నం ఏదో అనుకుంటే.ఇప్పుడు టీడీపీ ఇలా చేస్తోంది.మ‌నం కూడా మేనిఫెస్టో విడుద‌ల చేద్దాం“ అని ఒక‌రిద్ద‌రు.నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

అయితే.దీనిపై సీనియ‌ర్ నాయ‌కులు మాత్రం ష్‌.గ‌ప్‌చుప్‌.అంటూ.

సందేశాలు పెడుతున్నారు.దీనికి కార‌ణం ఆరాతీస్తే.

టీడీపీ తాజాగా ప్ర‌వేశ పెట్టిన మేనిఫెస్టోలో కొత్త‌గా చెప్పిన అంశాలు లేవ‌ని.ఈ విష‌యంలో వారితో వైసీపీకి పెద్ద‌గా పోటీ ఉండ‌ద‌ని.

పార్టీ అధిష్టానంభావిస్తున్నట్టు సీనియ‌ర్లు ప్ర‌చారం చేస్తున్నారు.

Telugu Ap, Ap Political News, Jagan Mohan Reddy, Latest News, Municipality, Political Heat, Political War, Tdp Manifesto, Ysrcp, Ysrcp Ministers-Telugu Political News

ఇక‌, అదేస‌మ‌యంలో కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు మేనిఫెస్టో ఇవ్వ‌డం అంటే.దిగ‌జారిపోవ‌డ‌మేన‌నిఇప్ప‌టికే సీఎం అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు కొంద‌రు సీనియ‌ర్లు అంటున్నారు.ఇలా మొత్తంగా చూస్తే.

వైసీపీలో టీడీపీ మేనిఫెస్టో క‌ల‌క‌లం రేపింది.దీనిపై కొన్ని మునిసిపాలిటీల్లో వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది.

ప్ర‌ధానంగా న‌గ‌రాలు.ప‌ట్ట‌ణాల్లో రూ.5కే అన్నం అంటే.ప్ర‌జ‌లు, కార్మికులు ఆదానివైపు మొగ్గు చూప‌డం కాయ‌మ‌ని.

సో.ఇదివైసీపీపై ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.మొత్తంగా చూస్తే.లోలోన మ‌థ‌న ప‌డుతున్నా.పైకి మాత్రం టీడీపీ మేనిఫెస్టోపై గుంభ‌నంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

#Ysrcp #TDP Manifesto #Municipality #Political War #YSRCP Ministers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు