ఉరిశిక్ష అమలుకు అంతా సిద్ధం చేస్తున్న అధికారులు  

Everything Getting Ready For Nirbhaya Victims Hanging-delhi Patiyala Court,nirbhaya,thihar Jail

2012 లో దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ ఘటనలో నిందితులకు ఇప్పటివరకు శిక్షలు అమలు చేయలేదు.

Everything Getting Ready For Nirbhaya Victims Hanging-Delhi Patiyala Court Nirbhaya Thihar Jail

ఇటీవల ఈ కేసు ను విచారించిన ఢిల్లీ పటియాలా కోర్టు ముద్దాయిలు నలుగురికి ఉరిశిక్ష లు ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది.అయితే మెర్సీ పిటీషన్ కు అనుమతి ఇవ్వడం తో నిందితుల్లో ఒకరు రాష్ట్రపతి కి క్షమాభిక్ష పిటీషన్ ను దాఖలు చేసుకున్నారు.

దీనితో ఈ రోజు అనగా 22 న వారికి ఉరిశిక్ష అమలు జరపాల్సి ఉండగా,మెర్సీ పిటీషన్ కారణంగా కొంత జాప్యం జరిగింది.అయితే రాష్ట్రపతి వారి పిటీషన్ ను తిరస్కరించడం తో వారి ఉరి శిక్షను పోస్ట్ పొన్ చేసి ఫిబ్రవరి 1 న వారి ఉరిశిక్షలు అమలు చేయాలి అని నిర్ణయించారు.

ఈ క్రమంలో వారిని ఉరితీయడానికి తీహార్ జైలు అధికారులు మాక్ ఉరిశిక్షలను కూడా అమలు పరిచారు.అయితే వారిని ఉరితీయడానికి తలారి పవన్ జల్లాద్ కూడా నియమితులయ్యారు.


దీనితో ఫిబ్రవరి 1 న నిర్భయ కేసులో దోషులు అయిన పవన్ గుప్తా,అక్షయ్ ఠాకూర్,ముఖేష్ సింగ్,వినయ్ శర్మ ల ఉరి శిక్ష అమలు చేయనున్నారు.ఈ క్రమంలో తలారి పవన్ జల్లాద్ ఈ నెల 30 వ తేదీన అక్కడకి చేరుకుంటారని అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో ఆ నలుగురు నిందితులను ఉరి తీసేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు

Everything Getting Ready For Nirbhaya Victims Hanging-delhi Patiyala Court,nirbhaya,thihar Jail Related....