8 నెలల క్రితం పెళ్లి.. ఉగ్ర దాడిలో మరణించిన గురు కన్నీటి స్టోరీ  

  • జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్‌ల కుటుంబ సభ్యులు ఎంతగా విలవిలలాడుతున్నారో వారి పరిస్థితిని ఊహించుకుంటేనే గుండెలు తరుక్కు పోతున్నాయి. 40 మంది జవాన్‌లను కోల్పోయిన మనం ఎంతగా బాధపడుతున్నామో వారి కుటుంబ సభ్యులను కోల్పోయి అత్యంత దారుణమైన పరిస్థితులను వారు అనుభవిస్తూ ఉంటారు. అమరులైన జవాన్‌ల కుటుంబాల కోసం అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరియు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఎంత ఆర్థిక సాయం చేసినా, ఎంతగా వారికి చేదోడు వాదోడుగా ఉన్నా కూడా వారికి చనిపోయిన వారి లేని లోటును భర్తీ చేయలేం. 40 మందిలో అందరి ఫ్యామిలీ కూడా కన్నీట మునిగి పోయారు.

  • కర్ణాటకకు చెందిన గురు విషయం మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పుకోవాలి. మండ్యకు చెందిన గురు 8 నెలల క్రితం కళావతి అనే యువతితో పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన వెంటనే బోర్డర్‌కు వెళ్లాడు. బోర్డర్‌కు వెళ్లిన గురు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఇటీవలే ఇంటికి వచ్చి 15 రోజుల పాటు ఉండి వెళ్లాడు. గురు వెళ్లే సమయంలో కళావతి నేను వస్తానంటూ పట్టుబట్టింది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకు వెళ్తాను అని, అక్కడ ఏర్పాట్లు చేసి వస్తాను అంటూ చెప్పి వెళ్లాడు.

  • Everything About Guru Of Mandya Who Got Martyred In Pulwama Attack-Crpf Jawan Mandya District Karnataka Attack

    Everything About Guru Of Mandya Who Got Martyred In Pulwama Attack

  • గురుతో వెళ్లేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కళావతికి ఆర్మీ అధికారుల నుండి వచ్చిన ఫోన్‌తో గుండె పగిలినంత పని అయ్యింది. ఆమె ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. గురును తన జీవిత సర్వస్వం అనుకుంది. కాని గురు మాత్రం దేశం కోసం ప్రాణాలు అర్పించి అందరికి శోఖం మిగిల్చి వేళ్లాడు. వీర జవాన్‌ గురు భార్య కళావతి కన్నీరును చూసి స్థానికుల గుండెలు పగిలి పోతున్నాయి.

  • Everything About Guru Of Mandya Who Got Martyred In Pulwama Attack-Crpf Jawan Mandya District Karnataka Attack
  • వచ్చి తీసుకు వెళ్తాను అన్నావు, ఒక్కడివే ఎందుకు వెళ్లావు అంటూ ఆమె ఏడుస్తుంటే ఆమెను ఎలా ఓదార్చాలో ఎవరికి అర్థం కావడం లేదు. 8 నెలల వైవాహిక జీవితంలో గురు ఎక్కువగా బోర్డర్‌లోనే ఉన్నాడు. అయినా కూడా కళావతి తన భర్త బోర్డర్‌లో బాధ్యతలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పేదట. ఈసారి వచ్చి తీసుకు వెళ్తాను అన్న గురు ఒక్కడే తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కళావతి కన్నీరు మున్నీరు అవుతోంది.