ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి పేజీలు ఉంటాయి... ఆసక్తికర పోస్ట్ చేసిన సీతారామం బ్యూటీ!

తెలుగు చిత్ర పరిశ్రమకు సీతారామం(sitaraamam) సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్(Mrunal thakur).ఇలా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతోమంది తెలుగు ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్నారు.

 Everyones Life Has Such Pages Mrunal Thakur Interesting Post Details, Nani,seeth-TeluguStop.com

ఇలా తెలుగులో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తన తదిపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని(Nani)తో కలిసిన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

Telugu Mrunal Thakur, Mrunalthakur, Nani, Shared, Seetharam-Movie

ఇలా తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా హిందీలో కూడా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి మృణాల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంభందించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తూ ఉంటారు.ఇక పోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఏడుస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఇలా ఈ ఫోటోని షేర్ చేస్తూ ఈమె గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలు గురించి తెలియజేశారు.ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ నిన్న చాలా కష్టంగా గడిచింది కానీ నేడు సంతోషంగా ఉన్నాను.

Telugu Mrunal Thakur, Mrunalthakur, Nani, Shared, Seetharam-Movie

ప్రతి ఒక్కరి జీవితంలోను చదవని పేజీలో ఉంటాయి.కానీ నేను వాటిని అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను.ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠాలను ఇతరులకు నేర్పాలి అంటూ ఏడుస్తున్న ఫోటోలను ఈమె షేర్ చేశారు.మరొక వీడియోను షేర్ చేస్తూ.నాకు కఠిన పరిస్థితులు ఎదురైన సమయంలో ఈ ఫోటో తీసుకున్నాను.కానీ ఈరోజు మాత్రం అలా లేదు చాలా సంతోషంగా ఉన్నాను.

నేను అనుకున్నది సాధించాను అంటూ ఈమె ఈ పోస్టు షేర్ చేశారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube