మెట్రో‌స్టేష‌న్‌లో అంద‌రి చూపు అటువైపే.. ఏం జ‌రిగిందో తెలిస్తే షాక్‌..!

సోషల్ మీడియా ఏజ్‌లో ప్రజెంట్ మనం ఉన్న సంగతి ప్రతీ సారి గుర్తు చేయాల్సిన అవసరం లేదు.ఒకప్పటిలా ప్రతీ విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం అక్కర్లేదు.

 Everyones Eyes Are On The Metro Station Shock If You Know What Happened-TeluguStop.com

ఘటన జరిగిన క్షణాల్లోనే మనకు తెలిసిపోతూనే ఉంటుంది.అలా చేస్తున్నారు నెటిజన్లు.

ఏ ఇంట్రెస్టింగ్ వీడియో దొరికినా వైరల్ చేసేస్తున్నారు.తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట ట్రెండవుతోంది.

 Everyones Eyes Are On The Metro Station Shock If You Know What Happened-మెట్రో‌స్టేష‌న్‌లో అంద‌రి చూపు అటువైపే.. ఏం జ‌రిగిందో తెలిస్తే షాక్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేంటంటే.

దేశరాజధాని ఢిల్లీ పరిధిలోని ఫరీదాబాద్ మెట్రోస్టేషన్‌ అప్పటి వరకు ప్రశాంతగానే ఉంది.

కానీ, ఒక్కసారిగా అక్కడ అందరూ అలర్ట్ అయ్యే పరిస్థితులు తలెత్తాయి.ఓ యువతి మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకడానికి ప్రయత్నించగా, పోలీసులు ఆమెను చాకచక్యంగా కాపాడారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.వివరాల్లోకెళితే.

ఫరీదాబాద్‌ సెక్టార్‌ 28 మెట్రో స్టేషన్‌లోని బాల్కనీ పైకి ఓ యువతి ఓ యువతి సాధారణంగానే వచ్చింది.ఆమెకు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడెన్‌గా అక్కడి నుంచి దూకాలని ప్రయత్నించింది.

రెండు లేదా మూడుసార్లు అక్కడి నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకుంది.అది గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

ఎస్సై ధన్‌ ప్రకాశ్‌ కానిస్టేబుల్ సర్ఫ్‌రాజ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.మెట్రో సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు.

అనంతరం మెట్రోస్టేషన్‌ కింద ఉన్న ఎస్సై మెల్లిగా సదరు యువతిని మాటల్లోకి దించాడు.

Telugu Faridabad Metro Station, Mental Illness, Metro Station, Police Si Saved, Shocking, Social Media, Viral Video, Woman Tried To Suicide-Latest News - Telugu

అలా ఆమె దృష్టిని మొత్తం ఒకరకంగా మరల్చాడు.ఇంతలో కానిస్టేబుల్‌ సర్ఫ్‌రాజ్‌ చాకచక్యంగా స్టేషన్‌ బాల్కనీకి చేరుకొని రెప్పపాటులో ఆమెను పట్టుకున్నాడు.దాంతో ఆమె ఇక ఆత్మహత్య చేసుకునేందుకు దూకడానికి వీలు లేకుండా అయింది.

ఈ క్రమంలోనే మరో వ్యక్తి కూడా బాల్కనీలోకి వెళ్లి సదరు యువతిని ఆపాడు.వారిద్దరు కలిసి ఆమెను బాల్కనీ నుంచి బయటకు తీసుకొచ్చారు.

యువతి వివరాలను పోలీసులు ఆరా తీశారు.ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న సదరు యువతి మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు యత్నించిందని పేర్కొన్నారు.

కాగా, ప్రాణాలకు తెగించి యువతి ప్రాణాలు కాపాడిన పోలీసులకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడం అభినందనీయమని పోస్టులు పెడుతున్నారు.

#Illness #Saved #Metro #Faridabad Metro

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు