లోకేష్ ఫ్యామిలీ ప్యాకేజీ క‌బుర్లు విన్నారా?

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌లో మ‌రో షేడ్ బ‌య‌ట ప‌డింది.ఇప్ప‌టి వ‌రకు పాలిటిక్స్‌ను ఒంట బ‌ట్టించుకునేందుకు ఆయ‌న చేసిన, చేస్తున్న ప్ర‌యోగాలు, ప్ర‌సంగాల‌ను కూసింత ప‌క్క‌న పెట్టి.

 Everyone Is Role Model In Our Family Says Nara Lokesh-TeluguStop.com

జ‌న‌ల‌ర్ మ్యాట‌ర్స్‌పై ముఖ్యంగా త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌పై ఆస‌క్తిక‌ర సంభాష‌ణ చేశాడు.ఈ నెల 1న ప్రారంభించిన టీడీపీ జ‌న చైత‌న్య యాత్ర‌ల‌కు కొద్దిగా మార్పు చేసి యువ చైత‌న్య యాత్ర‌ల పేరిట లోకేష్ కాలేజీ యువ‌త‌కు చేరువ అవుతున్నారు.

ఈ క్ర‌మంలో వారికి రాజ‌కీయాల‌పై పెద్ద ఎత్తున క్లాస్ ఇస్తున్నారు.ఏపీ సీఎం చంద్ర‌బాబు చేస్తున్న కృషిని ఆయ‌న ఏక‌రువు పెడుతున్నారు.

అయితే, మ‌రోప‌క్క వైకాపా అధినేత జ‌గ‌న్ కూడా పొలిటిక‌ల్ స్పీచ్‌ల‌తో స్టూడెట్స్ స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్న క్ర‌మంలో ఇటు లోకేష్‌, అటు జ‌గ‌న్‌ల వైఖ‌రితో విద్యార్థులు న‌లిగిపోతున్నార‌ని రిపోర్ట్ అందిందే ఏమో.లోకేష్ యూట‌ర్న్ తీసుకున్నారు.త‌న స్పీచ్‌లో మార్పును రంగ‌రించి ఇంట‌రాక్ష‌న్‌లో ఇంట్ర‌స్టింగ్ పాయింట్స్‌ను ఇంక్లూడ్ చేస్తున్నారు.ఈ క్ర‌మంలోనే విద్యార్థుల‌కు త‌న ఫ్యామిలీ గురించి, త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను గురించి కూడా వివ‌రించారు.

తాజాగా ఓ విద్యార్థి.‘మీ ఇంట్లో మీ రోల్ మోడ‌ల్ ఎవ‌రు?’ అని లోకేష్‌ని ప్ర‌శ్నించాడు.దీనికి లోకేష్‌ స‌మాధానం ఏంటంటే… ‘మా ఇంట్లో అంద‌రూ రోల్ మోడ‌ల్సే! కొన్ని విష‌యాల్లో మా తాత‌గారు నాకు రోల్ మోడ‌లు, కొన్ని విష‌యాల్లో మా నాన్న‌గారు నాకు రోల్ మోడ‌లు, కొన్ని విష‌యాల్లో మా మావ‌య్య‌గారు రోల్ మోడ‌లు, కొన్ని విష‌యాల్లో మా అమ్మ నాకు రోల్ మోడ‌లు, కొన్ని విష‌యాల్లో బ్ర‌హ్మీని కూడా నాకు రోల్ మోడ‌లు! సో.నాకు అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ప్యాకేజ్‌.ద‌టీజ్ లోకేష్‌’ అని స‌మాధానం ఇచ్చారు.

‘కాలేజ్ లైఫ్‌లో మీరు ఎవ‌రినైనా ల‌వ్ చేశారా.?’ అని ఓ కొంటె విద్యార్థి అడ‌గ్గానే.లోకేష్ ఏమాత్రం త‌డుము కోకుండా .కాలేజ్ డేస్‌లో ఉన్న‌ప్పుడు మీ అంద‌రిలానే క్ర‌షెష్ ఉండేవి.కానీ, మై వ‌న్ అండ‌న్ ఓన్లీ ల‌వ్ బ్ర‌హ్మీ! దాన్లో ఎలాంటి అనుమానం లేదు.

ఇద్ద‌రి క‌లిసి పెరిగాం.అందుకే, చాలా త‌క్కువ వ‌య‌సులో మాకు పెళ్లైపోయింది’ అని చెప్ప‌డంతో విద్యార్థులు సంతోషించారు! సో.ఆ విధంగా లోకేష్ త‌న ఇంట‌రాక్ష‌న్‌ను ఇంట్ర‌స్టింగ్ స‌బ్జెక్ట్‌తో ప్రారంభించి.యువ‌త‌ని పాలిటిక్స్‌లోకి దింపుతున్నాడట‌.

మొత్తానికి లోకేష్‌లో ఛేంజ్ వ‌చ్చింద‌ని తెలుగు త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube