' జగన్ బాణం ' దూసుకు వచ్చేది ఎప్పుడో ?

జగన్ వదిలిన బాణంపొలిటికల్ రీ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లినప్పుడు ఆయన బాధ్యతలు మొత్తం ఆమే చేపట్టారు.

 Everyone Is Interested In The Political Entry Of Jagan Younger Sister Sharmila,-TeluguStop.com

  పాదయాత్ర కూడా చేపట్టి ప్రజల్లో జగన్ బలం మరింత పెరిగేలా చేసి జగన్ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ స్వయంగా ఆమె ప్రకటించుకుని అందరిని ఆకట్టుకోగలిగారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని గుర్తు చేస్తూ ఆమె చేసిన పాదయాత్ర  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.జగన్ జైల్లో ఉన్నా, షర్మిల పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి పట్టు సంపాదించుకో గలిగారు.

ఇక ఆ తర్వాత ఆమె యథావిధిగా  వైసీపీలోనే యాక్టివ్ గా ఉంటారని అంత అభిప్రాయపడినా, ఆమె సైలెంట్ అయిపోయారు.2019 ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ,  ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆ ప్రచారంలోనూ ఆకట్టుకునే విధంగా షర్మిల ప్రసంగాలు ఉన్నాయి.బై బై బాబు అంటూ పంచ్ డైలాగులు పేల్చారు.ప్రస్తుతానికి వైసిపికి ఎటువంటి ఇబ్బంది లేదు.జగన్ అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు.

ఒక దశలో పార్టీ పరిస్థితి గాడి తప్పుతున్నట్టు కనిపిస్తుండడంతో, షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారు అంటూ ప్రచారం జరిగినా, ఆ తర్వాత అంతా కొద్ది రోజుల క్రితం షర్మిల తెలంగాణలో పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నారని, వైసిపి తెలంగాణ విభాగాన్ని కానీ, కొత్త పార్టీని కానీ స్థాపించి యాక్టివ్ కాబోతున్నారని, ఇదంతా కెసిఆర్ సలహాలు, సూచనలతో నే అనే ప్రచారం నడిచినా, అటు జగన్ ఇటు షర్మిల కానీ ఈ వ్యవహారంపై స్పందించలేదు.

Telugu Campain, Chandrababu, Jagan, Jail, Lokesh, Sharmila, Telangana, Telugudes

అయితే ఆమె తెలంగాణ కంటే ఏపీ రాజకీయాల్లో రాణిస్తే మంచిదని , జగన్ సీఎం గా, పార్టీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు నిర్వహించడంలో ఒత్తిడికి గురవుతున్నారని , కాబట్టి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు అప్పగిస్తే ఆమె సమర్థవంతంగా పార్టీ బాధ్యతలు నిర్వహించగలరు అని, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ని ఇరుకున పెట్టే విధంగా చేయగలగడం లో సక్సెస్ అవుతారు అనే అభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి.అయితే షర్మిల ఏపీ, తెలంగాణ లలో ఎక్కడో ఒక చోట యాక్టి వ్ అయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.అయితే ఆమె పొలిటికల్ ఎంట్రీపై మాత్రం వైసిపి వర్గాలు నోరు మెదపడం లేదు.

త్వరలోనే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో,  షర్మిలను యాక్టివ్ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube