ఆమెని అందరూ లేడీ కపిల్ దేవ్ అని అంటున్నారు... ఎందుకో గమనించారా?

దాదాపు 4 దశాబ్దాల కిందట భారత క్రికెట్ జట్టులో ఓ అద్భుతం జరిగింది.అవును, భారత్ లో ఫాస్ట్ బౌలరా? అంటూ ఇతర దేశాల ఆటగాళ్లు ఖంగుతిన్నారు.అప్పడంతా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లదే హవా నడిచేది.భరత్ నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ రావడం కూడా కష్టమే అనుకునేవారు.సరిగ్గా అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా వచ్చాడు ఓ కుర్రాడు.కేవలం బౌలింగ్ మాత్రమే కాక బ్యాట్ తోనూ తన సత్తా చాటాడు.

 Everyone Calls Her Lady Kapil Dev... Have You Noticed Why  Lady Kapil Dev, Sport-TeluguStop.com

అతడు రిటైరై సరిగ్గా 30ఏళ్లు అవుతోంది.మళ్లీ అలాంటి స్థాయి క్రికెటర్ భారత క్రికెట్ కు దొరకలేదు.

ఇక అతడిలోని సగం ప్రతిభ ఉన్నవారు కూడా మనకు దొరకలేదు అంటే సబబుగా ఉంటుందేమో.అతడే కపిల్ దేవ్.

ఇంతకీ ఇక్కడ అతని ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, మహిళల క్రికెట్ లో కూడా అచ్చం అలానే జరిగింది కాబట్టి.ఆమె పేరే జులన్ గోస్వామి.

అచ్చం పురుషుల క్రికెట్ లో ఎలాగైతే కపిల్ కు ముందు కపిల్ తర్వాత అని చెప్పుకొంటామో, మహిళల క్రికెట్ లో జులన్ కు ముందు తర్వాత అని చెప్పుకోవాలి.భారత మహిళల క్రికెట్ లో మిథాలీ రాజ్ లేడీ సచిన్ అయితే జులన్ గోస్వామి లేడీ కపిల్ అని చెప్పుకోవచ్చు.

Telugu Jhulan Goswamy, Lady Kapil Dev, Latest, Ups-Latest News - Telugu

అవును, భారత మహిళల ఫాస్ట్ బౌలింగ్ కు పర్యాయ పదంగా నిలిచింది జులన్.ఇంకో విషయం ఏమంటే మిథాలీ, జులన్ అండర్ -19 దశ నుంచి కలిసి ఆడారు.బ్యాటింగ్ లో మిథాలీ, బౌలింగ్ లో జులన్ పెద్ద దిక్కుగా నిలిచారు.అలాంటి గోస్వామి శనివారం తన కెరీర్ లో చివరి వన్డే ఆడుతోంది అనే విషయం ఎంతమందికి తెలుసు? ప్రఖ్యాత లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ ఆమెకు చివరిది కానుంది.విజయంతో జులన్కు వీడ్కోలు పలకాలని టీమ్ఇండియా పట్టుదలతో కనిపిస్తోంది.ఈ సీనియర్ పేసర్ కోసం సిరీస్ ని గెలిచి తీరుతాయని ఇప్పటికే ప్రకటించిన కెప్టెన్ హర్మన్ప్రీత్.

గెలుపు దిశగా జట్టును నడిపించాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube