ఒక్కొక్కరిది ఒక్కో కథ, అందరిది ఒకే కల - అంటూ వచ్చేస్తుంది 'స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' ఫిబ్రవరి 20 న

ఫిబ్రవరి 20 న సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే ‘మెగా లాంచ్’ ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్స్ గా విచ్చేసిన పూజ హెగ్డే –అమ్మ పాట ఎంత మధురంగా ఉంటుందో మన జీ తెలుగు వారి షోస్ కూడా అంతే ఆప్యాయతల్ని, మధురానుభూతుల్ని పంచి పెడతాయి.అలాంటి ఛానల్ నుంచి మరోసారి అందరు మెచ్చిన, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సింగింగ్ రియాలిటీ షో ‘స రి గ మ ప’ ఒక కొత్త సీజన్ తో మన ముందుకి వచ్చేస్తుంది, ఈ ఆదివారం, ఫిబ్రవరి 20 న సాయంత్రం 6 గంటలకు.

 Everybody Has A Story, Everyone Has The Same Dream - 'sa Ri Ga Ma Pa - The Singi-TeluguStop.com

రెండు నెలల ముందు తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ షో ఇప్పుడు ప్రతిభావంతులైన సింగర్స్ ని తన వేదిక మీదకు తీసుకొచ్చింది.అందులో ఎవరు ముందుకి వెళ్తారు, ఎవరు వెనుతిరుగుతారో తెలియాలంటే, ఫిబ్రవరి 27 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగు తప్పక వీక్షించండి.

ప్రతి సీజన్ కొత్త అనుభూతులతో పాటు వైవిధ్యంగా అభిమానుల ముందుకి తీసుకురావడానికి జీ తెలుగు కృషి చేస్తుంది.ఈ వేదిక నుంచి ఎంతో మంది ప్రతిభావంతులు ఇవాళ టాలీవుడ్ సంగీత ప్రపంచంలో దిగ్గజాలుగా స్థిరపడ్డారు.

అలాంటి ధ్రువ తారల్ని మెంటార్స్ గా ఈ సీజన్ లో కూడా మన ఛానల్ ప్రవేశ పెడుతుంది.వారే – గీతా మాధురి, రేవంత్, శ్రీ కృష్ణ మరియు సాకేత్ కొముందరి.

అంతేనా, ఈ గాయనీగాయకులను వారి యొక్క అనుభవాలతో, వారి సంగీత విజ్ఞానంతో సానపెట్టడానికి ఈ సీజన్ కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు – మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సింగర్ ఎస్ పి శైలజ, సింగర్ స్మిత మరియు గీత రచయిత అనంత శ్రీరామ్.ఈ సీజన్ వైవిధ్యాన్ని, కంటెస్టెంట్స్ యొక్క ప్రతిభను మరియు వారి కధల్ని వీక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది ఈ షో యొక్క రథసారథి యాంకర్ శ్రీ ముఖి.

ఈ సంగీత ప్రపంచంలో తేలిపోవడానికి సిద్ధంగా ఉండండి.మీ ముందుకి వచ్చేస్తుంది ‘ స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ ఈ ఫిబ్రవరి 20 నుండి.

జీ తెలుగు అందరికి వినోదం పంచిపెట్టడంలో ఎప్పుడూ వెనకాడదు.అభిమానుల కోసం తననితాను ఎప్పుడూ మార్చుకుంటూనే ఉంటుంది.

అందుకే ఈ సారి కూడా అబ్బురపరిచే విధంగా సెట్స్ తో పాటు, టాలీవుడ్ ఇండస్ట్రీ కి బుట్ట బొమ్మ అయిన పూజ హెగ్డే ను స్పెషల్ గెస్ట్ గా లాంచ్ ఎపిసోడ్ నాడు ఆహ్వానించారు.సుమంత్ మరియు వర్షిణి కూడా విచ్చేసి కంటెస్టెంట్స్ ని ఎంతో ప్రోత్సహించారు.

ఇంకా చెప్పాలంటే బుట్ట బొమ్మ స్టేజి మీద ఉంటే అబ్బాయిలు నిశ్శబ్దంగా ఎందుకు కూర్చుంటారు? అందరూ కలిసి పూజ తో స్టెప్ లు వేశారు.మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు పూజ కి గిటార్ ని బహుకరించారు, అనంత శ్రీరామ్, ఆవిడ మీద కొన్ని పంక్తులు రాసి అబ్బురపరిచారు.

చెప్పుకుంటే పోతే సంగీతానికి, వినోదానికి అవధులు లేనంత సందడిని ఈ ఆదివారం చూడవచ్చు.ఛానల్ ఇప్పటికే ప్రోమో, కంటెస్టెంట్స్ వివరాలు అందరికి తెలియచేసింది.ప్రోమో విడుదల చేసిన వెంటనే కర్నూల్ కి చెందిన దాసరి పార్వతి, ఈస్ట్ గోదావరి కు చెందిన డేనియల్ మరియు కడప కి చెందిన వినోద్ స్టార్స్ అయిపోయారు.వీళ్లతో పాటే ఇంకొంత మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

వారి కథలు, సంగీత ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే – ఈ ఫిబ్రవరి 20 సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు తప్పక చూడండి.

చీఫ్ కంటెంట్ ఆఫీసర్ – తెలుగు, అనురాధ గూడూరు ఈ షో గురించి మాట్లాడుతూ, “స రి గ మ ప ఒక షో మాత్రమే కాదు, ఎంతో మంది తలరాతల్ని మార్చిన ఒక వేదిక.

అలాంటి షో ని మేము మళ్లీ అందరి ముందుకి ఒక కొత్త సీసన్ తో తేవడం ఎంతో ఆనందంగా ఉంది.ఈసారి కూడా కంటెస్టెంట్స్ వారి సంగీతంతో వీక్షకులని అలరిస్తారని, మరియు వారి కధల తోటి ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తారని భావిస్తున్నాను.

వీరందరిని మీ ముందుకు సాధరంగా తీసుకొని వస్తున్నాం.తెలుగు ప్రజలు అందరిని అభిమానిస్తారని, వారిలో నచ్చిన వారిని గెలిపించి ‘ది సింగింగ్ సూపర్ స్టార్’ టైటిల్ ని అందిస్తారని భావిస్తున్నాను.”స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్ జడ్జెస్ లో ఒకరైన మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ, “నేను స రి గ మ ప తో మొదటి నుంచి ప్రయాణిస్తున్నాను.ఇప్పుడు 14 వ సీజన్ తో మళ్లీ అందరిముందుకి వస్తున్నాం.

ఇంతలా ఆదరిస్తునందుకు ఎంతో సంతోషంగా ఉంది.ఈ సారి కూడా మీ అందరి అంచనాలని దాటి మెరుగైన గాయనీగాయకులని పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.మీరు కూడా వారందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.”

ఎస్ పి శైలజ మాట్లాడుతూ, “మరోసారి అందరిని స రి గ మ ప ద్వారా కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఎప్పుడూ ఈ వేదిక ప్రతిభావంతులని అక్కున చేర్చుకొని వారికివారే సాటి అనే విధంగా తీర్చిదిద్దుతుంది.నేను ఎప్పటిలాగే ఈసారి కూడా వారిని ప్రోత్సహిస్తూ, అనుభవాలని పంచుకుంటూ, వారిని ది సింగింగ్ సూపర్ స్టార్ చేయడానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తాను.”స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్ జడ్జి గా వ్యవరిస్తున్న సింగర్ స్మిత మాట్లాడుతూ, “నేను కూడా ఇలాంటి ఒక ప్లాట్ ఫామ్ నుంచి వచ్చాను.చిన్నప్పటి నుంచి సంగీతం నాతోనే ఉంది.

ఈ స్టేజి మీదికి రావాలంటే ఎంత కష్టపడ్డారో నేను ఉహించగలను.ఈ సీజన్ లో క్వాలిటీ సంగీతం తో పాటు గుండెకు హత్తుకొనే ఎన్నో కథలని అందరు చూడగలుగుతారు.వారి పాటలే కాదు వారి కథలు కూడా అందరికి ప్రేరణగా నిలుస్తాయని భావిస్తున్నాను.”అనంత శ్రీరామ్ మాట్లాడుతూ,“స రి గ మ ప ఎంతోమంది జీవితాలని మార్చివేసింది.మరోసారి అందరి ముందుకి రాబోతుంది.ఈసారి కూడా తెలుగు ప్రజలందరు కలిసి మనసుని తట్టి లేపే ఆ సింగింగ్ సూపర్ స్టార్ ని ప్రపంచానికి చూపిస్తారని ఆశిస్తున్నాను.

”మరి ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరు, ఎలా పాడుతారు, వారి కథలు ఏంటి, బుట్ట బొమ్మ కి ఎవరు నచ్చారు, కోటి గారి స్టెప్స్, స్మిత గారి అనుభూతులు చూడాలంటే ఈ ఆదివారం ఫిబ్రవరి 20 సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగు లో తప్పక చూడండి.అలాగే ఈ సమరంలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఫిబ్రవరి 27 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు తప్పక వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube