ఆ రకంగా ఆడవారి కన్నా మగవారు ఎక్కువగా చనిపోతున్నారు

“సడెన్ కార్డియాక్ డెత్” అంటే ఎలాంటి లక్షణాలు బయటపడకుండా సడెన్ గా హార్ట్ అటాక్ తో, లేదా గుండె జబ్బుతో చనిపోవడం.ఇలాంటి సడెన్ హార్ట్ అటాక్ తో ప్రతీ సంవత్సరం వేలమంది చనిపోతున్నారు.

 Every 9th Man And 30th Woman Are At Risk Of Sudden Cardiac Death-TeluguStop.com

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇలా చనిపోతున్నవారిలో అధికశాతం మంది మగవారే.మళ్ళీ తేడా కూడా మామూలు తేడా కాదు.

చాలా పెద్ద తేడాతో ఇలాంటి చావు మగవారిని ఎక్కువగా బలితీసుకుంటోంది.

న్యూయార్క్‌ లో ఇటివలే జరిగిన ఒక స్టడీ ప్రకారం, 45 ఏళ్ళ వయసు దాటిన ప్రతి తొమ్మిదొవ మగవాడు “సడెన్ కార్డియాక్ ” వలన చనిపోయే అవకాశం ఉందట.

ఇదే మహిళల్లో తీసుకుంటే ప్రతీ 30వ మహిళలకి ఇలాంటి చావు వచ్చే అవకాశం ఉందట.చూసారుగా ఎంత తేడా ఉందో! బ్లడ్ ప్రెషర్ రేట్ ఎక్కువగా పెరిగిపోవటం ఇలాంటి చావులకి కారణంగా చెబుతున్నారు పరిశోధకులు.

మగవారికి ఉండే చెడు అలవాట్ల వల్లే ఈ ప్రమాదం వారికి ఎక్కువగా ఉంటోదని అభిప్రాయపడ్డారు డాక్టర్లు.

దాదాపు 5200 మంది మగ,ఆడవారి పైన ఈ రిసెర్చ్ నిర్వహించారు.

ఈ రిసర్చి నడుస్తున్న సమయంలో 375 మంది “సడెన్ కార్డియాక్ డెత్” బారిన పడి ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యకరం.ఇలాంటి కేసుల్లో ఉన్న తంటా ఎంటంటే, మనిషి చనిపోయేదాకా గుండెలో సమస్యలు కనబడకపోవడం.

ప్రస్తుతం ఈ సమస్య కేవలం అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా ఉంది.మనిషి జీవనశైలే ఇలాంటి మరణాలకి మూలం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube