ఈ విచిత్ర జంతువుని ఎపుడైనా చూసారా? చూస్తే చెప్పండి ఒకసారి!

ఈ ప్రకృతిలో మనమెలా అయితే ఒక భాగమో మిగతా జంతువులు కూడా అలాగే ఒక భాగం అని గుర్తెరగాలి.కానీ అవేవి పట్టని మానవుడు పరిసరాలతో పాటు జంతువులను కూడా పొట్టనబెట్టుకుంటున్నాడు.

 Ever Seen This Strange Animal If You See It, Tell Me Once, Rare Animal,viral La-TeluguStop.com

అవును, మనకు ప్రసాదించిన వాటిని మనం నాశనం చేసుకుంటున్నాం.కొండలను పిండి చేస్తున్నాం, అడవులను నరికేస్తున్నాం, జంతువులను చంపేస్తున్నాం.

మనం మన స్వార్థం కోసం ఉన్న వాటిని సర్వనాశనం చేస్తున్నాం.ఫలితంగా అడవులు అంతరిస్తున్నాయి.

 Ever Seen This Strange Animal If You See It, Tell Me Once, Rare Animal,viral La-TeluguStop.com

ప్రకృతి వైపరీత్యాలు భయపెడుతున్నాయి.ఇవన్నీ ప్రకృతిని మనం అంతం చేయడంతో జరిగే దుష్ఫరిణామాలే అని తెలుసుకోవాలి.

లేదంటే మన తరాలు చాలా ప్రమాదంలో పడతాయి.

భవిష్యత్ తరాలకు కోట్లు సంపాదించి ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నాం కానీ అడవులను, కొండలను, జంతువులను కాపాడి మనం వారికి కానుకగా ఇవ్వలేమా అని చెబుతున్నాయి కొన్ని స్వశ్చంద సంస్థలు.

ఇటీవల ఆఫ్రికా దేశాల్లో కరువు తాండవిస్తుంటే పాకిస్తాన్ లో వరదలు వచ్చాయి.ఇవి ప్రకృతి విరుద్ధమైన పనులతో వచ్చే ఫలితాలే అని గుర్తుపెట్టుకోవాలి.రానురాను పులులు, సింహాలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు.అడవికి రారాజుగా పిలిచే సింహాల సంతతి కనుమరుగవుతోంది.

ఇక అసలు విషయంలోకి వెళితే, ఇటీవల ఏలూరు జిల్లా ఏజెన్సీలో అడవి అలుగుల సంచారం కనిపిస్తోంది.అయితే వీటికి చైనాలో మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలుసా? అక్కడ దీన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారట.దీంతో వీటిని విక్రయిస్తే రూ.20 లక్షల వరకు ధర పలుకుతుందట.దీంతో వాటిని అక్రమంగా రవాణా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.అడవి అలుగులు ఇక్కడ ఇరవై వరకు ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.దీంతో వాటిని పట్టుకుని విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పలువురు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube