అరుదైన తెల్ల పామును ఎప్పుడైనా చూశారా ?

నిత్యం మన గ్రామాలల్లో చాలా రకాల పాములను చూస్తుంటాము.కొన్ని విష పూరిత పాములు కూడా ఎక్కువగా తిరుగుతుంటాయి.

 Ever Seen A Rare White Snake,white Snake,chhattisgarh,alpanijam Reason,body Self-TeluguStop.com

పాములు ఎక్కువగా చెట్ల పొదల్లో, పంట పొలాల్లో సంచరించే సంగతి తెలిసిందే.అయితే మనం ఇప్పటికే ఎన్నో రకాల పాములను చూసి ఉంటాం కానీ తెల్ల రంగులో ఉన్న పాముని ఎప్పుడు చూసి ఉండము.

నిజానికి అసలు ఆ తెలుపు రంగులో ఉన్న పాము గురించి వినికూడా ఉండము.

అలాంటిది ఇటీవల ఛత్తీస్ గడ్ లో తెల్ల జాతికి సంబంధించిన కట్లపాము తిరుగుతున్న ఘటన చోటు చేసుకుంది.

మరి ఈ పాము గురించి ఏంటో తెలుసుకుందాం.చత్తీస్ గడ్ లో సూరజ్ పూర్ జిల్లా జయ నగర్ గ్రామంలో ఈ తెల్ల రకం కట్లపాము కనిపించడంతో గ్రామస్తులంతా భయాందోళనలకు గురయ్యారు.

ఆ గ్రామంలో ఉన్న ఓ బావిలో ఈ తెల్ల పాము ఉండటం చుసిన గ్రామస్తులు పాములు పట్టే వ్యక్తికి ఈ విషయాన్ని తెలిపారు.

కట్ల పాములలో ఇది ఒక జాతికి సంబంధించిన పామేనని, అంతేకాకుండా ఇది అరుదుగా కనిపించే తెల్లని పాము అని పాములు పట్టే వ్యక్తి విషయాన్ని తెలిపారు.

అల్బనిజం అనే కారణంతో ఈ కట్లపాము తెల్లగా ఉంటుందని తెలిపారు.ఇది విషపూరితమైన పాము, వీటిని రెచ్చగొడితే ప్రమాదమని పాములు పట్టే వ్యక్తి ఈ పాము గురించి తెలిపారు.

Telugu Alpanijam, Defense, Chhattisgarh, White Snake-Latest News - Telugu

ఒక్కోసారి ఈ తెల్ల పాము తన శరీర ఆత్మరక్షణ కోసమై తలదాల్చుకుంటుందని అంతేకాకుండా ఈ పాము పగలంతా పడుకుంటూ, రాత్రి సమయాన బయటకు తిరుగుతాయని తెలిపారు.ఇలాంటి అరుదైన పాములు ఎక్కువగా చెట్ల పొదల్లో వంటివాటిలో సంచరిస్తాయని.ఇక ఆ అరుదైన పాములు కనబడితే వాటిని చంపకుండా పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చి అటవీశాఖ అధికారులకు అప్పగించాలని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube