మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య గల తేడాలను ఎపుడైనా గమనించారా?

ఈ సందేహం అనేకమందికి ఉంటుంది.బేసిగ్గా సగటు ఉద్యోగస్తుడుకి ఇలాంటి అనుమానం ఖచ్చితంగా వస్తుంది.

 Ever Notice The Differences Between Mutual Fund , Equity, Sip, Mutual Fund, Equi-TeluguStop.com

ఎందుకంటే వారు తన కుటుంబంకోసం ముందుగానే పెట్టుబడులు పెడతారు.కాబట్టి ఇలాంటి వాటిని నివృత్తి చేసుకొనే అవసరం ఎంతైనా వుంది.

ఇపుడు మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య గల తేడాను చూద్దాము.ఈక్విటీ అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడులు.

 Ever Notice The Differences Between Mutual Fund , Equity, SIP, Mutual Fund, Equi-TeluguStop.com

నేరుగా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్ల ద్వారా పరోక్షంగా కూడా మార్కెట్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.

ఇక షేర్ల విషయానికొస్తే, రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇందులో పెట్టుబడికి సమయం, నైపుణ్యం ఎంతో అవసరం.నిపుణులను సలహా కోరి మాత్రమే షేర్లు ఎంచుకోవడం మేలు.

ప్రతి మ్యూచువల్ ఫండ్‌కు ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు.వారు ఎలాంటి షేర్లలో పెట్టుబడి పెట్టాలో నిర్ణయిస్తారు.

మదుపరుల నుంచి డబ్బు సమీకరించి 100-200 షేర్లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు.కాబట్టి, రిస్క్ కొంత వరకు తగ్గే అవకాశం కలదు.

అయితే ఇందులో పెట్టుబడి పెట్టడానికి 2 మార్గాలు వున్నాయి.లంప్సమ్, అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం లేదా సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా నెల నెలా క్రమంగా పెట్టుబడి పెట్టవచ్చు.

సిప్‌లో మార్కెట్‌తో సంబంధం లేకుండా పెట్టుబడి పెడతాం కాబట్టి రిస్క్ మరి కాస్త తగ్గుతుంది.కనీసం 10 ఏళ్ల పాటు మదుపు చేసే ఉద్దేశం ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవడం ఉత్తమం.

Video : Ever Notice The Differences Between Mutual Fund , Equity, SIP, Mutual Fund, Equity, Sip, Different, Difference, Banking, Services #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube