స్విఛ్ ఆఫ్ చేసినా ఇవి మాత్రం క‌రెంట్‌ను లాగేస్తాయంట‌..!

ప్రస్తుత టెక్ ఎరాలో ప్రతీ ఒక్కరు పవర్ లేకుంటే జీవించడం చాలా కష్టం.ఒక గంట పవర్ పోతే చాలు ఉక్కపోతతో సతమతమయ్యే వాళ్లను మనం బోలెడు మందని చూడొచ్చు.

 Even If They Are Switched Off They Still Draw Current-TeluguStop.com

ఇక పవర్‌తో నడిచే ఎలక్ట్రానిక్ డివైజెస్ చాలానే మనం వాడుతున్నాం.అందులో ముఖ్యమైనది సెల్ ఫోనే.

ఫోన్ చార్జింగ్ లేకపోతే చాలు ఏదో అయిపోయినట్లు బాధపడేవారు ఉన్నారు.ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ డివైజెస్ కోసం మరీ ఎక్కువ విద్యుత్‌ను వాడుతున్నామా? అనే విషయం ప్రతీ సారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.సాంకేతికతకు విద్యుత్ ముఖ్యం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ క్రమంలో టెక్ డివైజెస్ ద్వారా విద్యుత్ సరఫరా ఎలా చేయాలో? ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం.

 Even If They Are Switched Off They Still Draw Current-స్విఛ్ ఆఫ్ చేసినా ఇవి మాత్రం క‌రెంట్‌ను లాగేస్తాయంట‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుత సమాజంలో ప్రతీ ఇంటికి టీవీ, ప్రతీ ఒక్కరికి సెల్ ఫోన్ మస్ట్‌గా మారింది.ఈ క్రమంలోనే టెలివిజన్ సెట్స్ వల్ల ఎక్కువగా విద్యుత్ కంజూమ్ అవుతున్నది.

చాలా మంది టీవీలు చూస్తూనే రిమోట్ ఆఫ్ చేసి వేరే పనుల్లోకి వెళ్లిపోయి బిజీ అయితారు.లేదంటే నైట్ టైంలో టీవీలను స్విఛ్ ఆఫ్ చేయకుండానే స్లీప్‌లోకి వెళ్తారు.

అలా చేయడం వల్ల టెలివిజన్ స్టాండ్ బై మోడ్‌లోకి వెళ్లి ఇక రోజుకు 24 వాట్ల విద్యుత్ తీసుకుంటుంది.ఇలా ఒక రోజుకు అయితే ఓకే కావచ్చునేమో.

కానీ, ప్రతీ రోజు అలాగే జరిగితే పవర్ బిల్లు మోత మోగడం గ్యారంటీ.

Telugu Consuming Power, Current, Micro Wave Ovens, Phone Charger, Power Bill, Switch Off, Technology, Television Set, Tv-Latest News - Telugu

ఫోన్ చార్జర్ కూడా అంతే.చార్జ్ పూర్తయ్యాక సాకెట్ నుంచి చార్జర్ తీసేయాలి.కేవలం స్విఛ్ ఆఫ్ చేస్తే సరిపోదు.ఛార్జర్‌ సగటున రోజుకి 1.3 వాట్ల పవర్‌ను లాగేసుకుంటుంది.అంతేకాదు అలానే ఉంచడం వల్ల ఛార్జర్‌ పాడైపోయే అవకాశం ఉంటుంది.వైఫ్ మోడెమ్ కూడా నైట్ పూట ఆఫ్ చేయడమే బెటర్.వాడని సమయంలో మైక్రోఓవెన్స్‌ను ఆఫ్ చేయడం మంచిదే.రైస్ కుక్కర్లు, టేబుల్ ఫ్యాన్స్, బ్లూటూత్ స్పీకర్స్ తదితర ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్నిటి పట్ల ఈ జాగ్రత్తలు వహించాలి.

#Power Bill #Power #Phone Charger #Switch

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు