కారు ఢీ కొట్టినా.. రిపోర్టింగ్ మాత్రం ఆప‌లేదు.. వీడియో వైర‌ల్‌

వృత్తి ఏదైనా స‌రే దాన్ని నిబ‌ద్ధ‌త‌తో చేస్తేనే ఆ రంగంలో రాణించ‌గ‌లుగుతాం.అయితే ఈ నిబ‌ద్ధ‌త‌త‌కు కూడా ఓ హ‌ద్దు అనేది ఉంటుంది.

 Even If The Car Crashes The Reporting Does Not Stop The Video Goes Viral Details, Amazing Reporting, Viral Video, Wsaz Tv Reporter, Torre Yourgi, Car Dashes Report, Reporting Not Stopped, Social Media, Vrial Video-TeluguStop.com

ఈ జ‌న‌రేష‌న‌ల్ లో అంత నిబ‌ద్ధ‌త‌త అనేది ఊహించ‌డం చాలా క‌ష్టం.కాగా ఇలాంటి రోజుల్లో కూడా కొంద‌రు మాత్ర‌మే ఎలాంటి స్వార్థాన్ని ఆశించ‌కుండా ఎంచుకున్న రంగం మీద ఉన్న మ‌క్కువ‌తో అత్యంత నిబ‌ద్ధ‌త‌తో బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తున్నారు.

ఇక ఇలాంటి వారికి సంబంధించిన వార్త‌లు నెట్టింట్లో మ‌న‌కు అనేకం క‌నిపిస్తుంటాయి.అలాంటి వారికి నెటిజ‌న్లు, ప్ర‌జ‌ల నుంచి కూడా చాలా మ‌ద్ద‌తు వ‌స్తుంది.

 Even If The Car Crashes The Reporting Does Not Stop The Video Goes Viral Details, Amazing Reporting, Viral Video, Wsaz Tv Reporter, Torre Yourgi, Car Dashes Report, Reporting Not Stopped, Social Media, Vrial Video-కారు ఢీ కొట్టినా.. రిపోర్టింగ్ మాత్రం ఆప‌లేదు.. వీడియో వైర‌ల్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పోలీసులు, డాక్ట‌ర్లు, జ‌ర్న‌లిస్టులు, క్యాబు డ్రైవ‌ర్లు, బ‌స్ డ్రైవ‌ర్లు ఇలాంటి వృత్తి నిబ‌ద్ధ‌త‌త‌ను చాలా ఎక్కువ‌గా చూపించ‌డం మ‌నం చూస్తుంటాం.ఎందుకంటే వీరి రంగాలు సమాజ సేవ‌కు సంబంధించిన‌వి ఉంటాయి.

అందుకే వారికి అంత ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది.ఇక‌పోతే ఇప్పుడు కూడా ఓ జ‌ర్న‌లిస్టు ఇలాగే చేసిది.

ఆమె చేసిన ప‌నికి అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.త‌న‌కు రిపోర్టింగ్ చేస్తున్న క్ర‌మంలో యాక్సిడెంట్ అయినా స‌రే ప‌ట్టించుకోకుండా వృత్తిని నిర్వ‌ర్తించింది.

వీడియో సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అవుతోంది.

WSAZ-TVలో రిపోర్టర్ గా ప‌ని చేస్తున్న‌టువంటి టోరీ యోర్గీ వృత్తి ప‌ట్ల అత్యంత నిబ‌ద్ధ‌త క‌లిగి ఉంటుంది.అయితే ఆమె రిపోర్టింగ్ చేస్తున్న స‌మ‌యంలో రోడ్డు మీద నుంచి ఓ కారు వేగంగా వ‌చ్చి వెన‌కాల నుంచి ఢీ కొట్టి వెళ్లిపోతుంది.కింద పడిపోయినా కూడా ఆమె రిపోర్టింగ్ ఆప‌కుండా అలాగే కంటిన్యూ చేసింది.

అయితే యాంక‌ర్ కూడా యోగ క్షేమాలు అడ‌గ్గా.తాను బాగానే ఉన్నాన‌ని చెబుతూనే అక్క‌డి ఘ‌ట‌న మీద రిపోర్టింగ్ చేయ‌డం అంతా లైవ్ లో ప్ర‌సారం అవుతుంది.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా చెక్క‌ర్లు కొడుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube