ఏపీలో ప్ర‌భుత్వం మారినా.. ప‌ద్ధ‌తులు మార‌లేదు.. వైసీపీ తీరుపై సెటైర్లు..!

రాష్ట్రంలో ప్ర‌భుత్వాలు మారినా.నాయ‌కులు అవ‌లంబిస్తున్న తీరు మాత్రం మార‌డం లేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.ముఖ్యం గా ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వ పార్టీ వైసీపీ త‌ర‌ఫున నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ వ‌స్తున్నాయి.“గ‌తంలో

టీడీపీకి-

ఇప్పుడు వైసీపీకి తేడా ఏమీలేదు!“ అనే కామెంట్లు జోరుగా ప‌డుతున్నాయి.దీనికి కార‌ణం ఏంటి? అని ఆరా తీస్తే.కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వినిపించాయి.

 Even Government Changes In Ap..methods Have Not Changed..satires On Ycp, Ap, Ap-TeluguStop.com

గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో ఆయ‌న‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతూ.నాయ‌కులు నిత్యం జ‌పం చేసేవారు.

ఇక‌, బాబును ఏదో ఒక రూపంలో ఆకాశానికి ఎత్తేయ‌డం.అంతా బాబుదేన‌ని.

ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే అంతా మెలుగు తున్నామ‌ని క‌ల‌రింగ్ ఇచ్చారు.

ఇక‌, ఇప్పుడు వైసీపీ నాయ‌కులు కూడా ఇదే త‌ర‌హాలో జ‌గ‌న్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఎక్క‌డ‌, ఎవ‌రు, ఏ వేదిక ఎక్కినా.జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ‌తో భ‌జ‌న సాగుతోంది.

సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు నాయ‌కులు, మంత్రులు జ‌గ‌న్ భ‌జ‌న‌లో మునిగి తేలుతున్నారు.ఇక‌, ప‌థ‌కాల పేర్ల విష‌యంలో గ‌తంలో చంద్ర‌బాబును విమ‌ర్శించిన వైసీపీ నాయ‌కులు ఇప్పుడు తామే.

జ‌గ‌న్ పేరు పేట్టాల‌నే ఒత్తిళ్లు తెస్తున్నారు.దీంతో ఇటీవ‌ల కాలంలో ప్రారంభిస్తున్న ప్ర‌తి ప‌థ‌కం కూడా జ‌గ‌న్ పేరుతోనే బ‌య‌ట‌కు వ‌స్తోంది.

Telugu Ap Cm Jagan, Ap, Chandra Babu, Jagan, Methods, Poltics, Ycp-Telugu Politi

మ‌రోవైపు.కాల‌నీల‌కు పేర్ల విష‌యంలోనూ నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.గ‌తంలో దేవాన్ష్‌-నారా లోకేష్ కాల‌నీ అంటూ.రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో పేర్లు పెట్టుకునేవారు.ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న‌పురం అంటూ.బోర్డులు వెలుస్తున్నాయి.

ఇవ‌న్నీ కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి.దీంతో తేడా ఏంటి?  బాబుకు, జ‌గ‌న్‌కు? అంటూ.సోష‌ల్ మీడియాలో కామెంట్లు ప‌డుతున్నాయి.అయితే.నాయ‌కులు మాత్రం దీనిపై ఎక్క‌డా స్పందించ‌డం లేదు.

ఎవ‌రికి వారుగా రాజ‌కీయాలు చేస్తున్నారు.

కుదిరిన‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.పార్టీ ప‌త‌కాలను ఇళ్ల‌పై క‌డుతున్నారు.

ఇలా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నాలుగు పొగ‌డ్త‌లు, ప‌ద‌హారు ప్ర‌శంస‌లు అన్న‌విధంగా త‌మ‌కు తామే పొగుడుకుంటూ.ఉంటుండ‌డంతో సోష‌ల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు కురుస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube