పెళ్లి తర్వాత కూడా ఐటమ్ సాంగ్ కి ఓకే చెప్పేస్తున్నా కాజల్.. నెటిజన్స్ ఫైర్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయం లోనే తెలుగు నాట ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

 Even After The Wedding Kajal Says Ok To The Item Song Netizens Fire Details, Kaj-TeluguStop.com

తన నటనతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.

తొలిసారిగా లక్ష్మి కళ్యాణం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కాజల్.

ఇక ఆ తరువాత మగధీర సినిమాలో నటించగా ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు.ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ.తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది.చాలావరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

మంచి హోదాలో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు తో కొంతకాలం రిలేషన్షిప్ లో ఉండి.అతడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.

ఇక ఈ భామ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటూ తన భర్త తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది.

పెళ్లి తరువాత కూడా సినిమాలలో బాగా అవకాశలు అందుకుంది.ఇక తను గర్భవతి అని తెలిసాక సినిమాలకు దూరంగా ఉంది.

గర్భవతిగా ఉన్న కూడా వర్కౌట్లు చేస్తూ అందరికీ ఆకర్షణగా నిలుస్తుంది.పైగా తన ఫోటో షూట్ లతో అందరిని ఆకట్టుకుంది.

Telugu Allu Arjun, Item, Kajal, Kajal Aggarwal, Kajal Item, Pushpa, Pushpa Kajal

ఒక ఇల్లాలిగా మంచి గౌరవం సంపాదించుకొని.ఒక బిడ్డకు ప్రతి రూపాన్ని ఇస్తుందని తెలియటంతో ప్రతి ఒక్కరూ తనకు సలాం కొట్టగా.మొత్తానికి ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.తనకు బాబు పుట్టడంతో సెలెబ్రేటిలతో పాటు తన అభిమానులు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు.

కాజల్ డెలివరీ తర్వాత ఇదివరకు లాగే ఉంది.ఒక బిడ్డ తల్లి అంటే తనను అస్సలు నమ్మరు.

పైగా బాగా ఎనర్జీగా కూడా కనిపిస్తుంది.అంతేకాదండోయ్ మళ్లీ వర్కవుట్లు చేయడం మొదలు పెట్టింది.

నిజానికి ఇంత త్వరగా ఆమె వర్కవుట్లు చేయడం అంటే మామూలు విషయం కాదు.పైగా తను వర్కౌట్ లు చేసిన వీడియోలను కూడా మళ్లీ పంచుకుంటుంది.

Telugu Allu Arjun, Item, Kajal, Kajal Aggarwal, Kajal Item, Pushpa, Pushpa Kajal

ఇక ఇదంతా పక్కన పెడితేఈ ముద్దుగుమ్మ మళ్ళీ సినిమాలోకి అడుగుపెడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఒక సినిమాలో అవకాశం అందుకున్నట్లు.పైగా ఆ సినిమాలో తను ఐటమ్ గర్ల్ గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకు అసలు విషయం ఏంటంటే.అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో కాజల్ చిందులేయనున్నట్లు వార్తలు వినిపిస్తాయి.

ఇక ఇప్పటికే సుకుమార్ కాజల్ ని సంప్రదించినట్లు తెలిసింది.

ఇక కాజల్ కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది.మొత్తానికి కాజల్ ఐటమ్ సాంగ్ లో చేయనున్నట్లు తన అభిమానులకు తెలియడంతో వాళ్లు చాలా ఫైర్ అవుతున్నారు.

నువ్వు హీరోయిన్ గానే నటించాలి అంతేకానీ ఐటమ్ గర్ల్ గా కనిపించకూడదు అని తన అభిమానులు వాపోతున్నారు.మరికొందరు పెళ్లయ్యాక ఐటెం సాంగ్ ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube