టీనేజ్ దాటాక కూడా మొటిమలు రావడానికి కారణాలు   Even After Teenage, Pimples May Occur For These Reasons     2017-01-06   02:57:47  IST  Lakshmi P

దాదాపుగా ప్రతీ రెండొవ టీనేజర్ ని ఇబ్బందిపెట్టే సమస్య ఆక్నే (మొటిమలు). కొందరికి వీటి బెడద ఎక్కువ ఉంటుంది .. అంతే తేడా ! అయితే మొటిమలు కేవలం టీనేజర్స్ కే వస్తాయి, ఆ తరువాత రావు అని అనుకుంటే అది మీ పొరపాటే. టీనేజ్ దాటిన తరువాత కూడా మొటిమలు రావొచ్చు. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

* 22-23 సంవత్సరాలు దాటినా, పింపుల్స్ రావడానికి అతిపెద్ద కారణం డిప్రేషన్. ముభావంగా ఉండే ముఖం ఎప్పుడు అనారోగ్యానికే దారి తీస్తుంది. స్ట్రెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి, ఆయిల్ సీక్రేషన్ ఎక్కువైపోయి మొటిమలు ఏర్పడతాయి.

* ఒక్కసారిగా డైట్ మార్చడం వలన మొటిమలు వస్తాయి. మహానగరాల్లో ఉండే యువత తిండి ఎప్పుడు ఒకెలా ఉండదు. రుచి కోసం కొత్తరకం వంటకాలన్నీ ప్రయత్నిస్తారు. అవి ఇంట్లో ప్రయత్నిస్తే వేరు విషయం, బయట ఫుడ్ కి అలవాటు పడితేనే కష్టం.

* కొన్నిరకాల స్కిన్ ప్రాడక్ట్స్ కూడా బ్రేక్ అవుట్స్ కి కారణమయ్యి, మొటిమల బెడద పెంచుతాయి. అందుకే బ్యూటి ప్రాడక్ట్స్ అయినా సరే, పరిజ్ఞానం ఉన్నవారిని సంప్రదించే వాడాలి.

* స్మార్ట్ ఫోన్స్ రోజంతా వాడతారు కాని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకునే అలవాటు ఎవరి దగ్గర కనబడదు. స్మార్ట్ ఫోన్స్ మోసుకొచ్చే బ్యాక్టీరియా కంటికి కనబడదు కాని చేయాల్సిన హాని చేస్తుంది.

* చేతులు ముఖం మీద పెట్టే అలవాటు ఉంటుంది కొందరికి. నిజానికి ఇది చెడ్డ అలవాటు. ఎక్కడెక్కడో చేతులు పెట్టి, బ్యాక్టీరియా తగిలించుకొని, ముఖానికి మీరే రాసుకుంటారు.

* ఇక సీటిల్లో ఉండే పోలుషన్, గంటలకొద్దీ ప్రయాణాలు ఎలాగో బ్రేక్ అవుట్స్ కి కారణమవుతాయి. ఇక జెనిటిక్ ప్రాబ్లం, హార్మోనల్ ప్రాబ్లంతో మొటిమలు వస్తే, అది మీ దురదృష్టం.