జ‌న‌సేన పొత్తుల‌పై క్లారిటీ ఇచ్చినా.. ఇంకా ఎక్క‌డో కొడుతోంది..

ఏపీలో పొత్తుల విషయం ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆ రెండు పార్టీ ఒక్క‌ట‌య్యే సూచ‌న‌లు ఉన్నాయ‌ని అంటున్నారు.విశ్లేష‌కులు అయితే ఇక్క‌డ ఎవ‌రి అడుగు ముందు ప‌డుతుందో తెలియ‌న‌ప్ప‌టికీ ఎవ‌రి ధీమాలో వారు ఉన్నారు.

 Even After Giving Clarity On Jana Sena Alliances It Is Still Doubting Details,-TeluguStop.com

వాళ్లు వ‌స్తేనే మ‌నం స్పందిద్దాం అన్న‌టు ఇరు పార్టీలు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.ఒక‌రు ముందుకొస్తే త‌మ డిమాండ్ల‌ను చెప్పి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాల‌ని చూస్తే.

మ‌రొక‌రు వాళ్లు వ‌స్తే క‌లుద్దాం లేదంటే ఎన్నిక‌ల వ‌ర‌కు చూద్దాంలే అనే నిర్ణ‌యంతో ఉన్నార‌ని అంటున్నారు.వీళ్లు ఇక్క‌ట‌వ్వ‌క‌పోతే మాత్రం త్రిముఖ పోటీలో వైసీపీకే మేలు జ‌రుగుతుంద‌న్న వాద‌న వినిపిస్తుండ‌టంతో ఎవ‌రు పొత్తుల విషంయ‌లో ముందుకు వ‌స్తారో చూడాల్సిందే.

అయితే ఒక పార్టీని స‌క్సెస్ ఫుల్ గా నడిపించాలనుకుంటే దానికి తగిన కార్యాచరణ అవ‌స‌రం.ముఖ్యంగా క్లారిటీ ఉండాలి.అయితే గ‌తంలో జనసేన అధినేత పవన్ క‌ల్యాణ్ పొత్తుల‌పై క‌లిసి ప‌నిచేయాల‌ని అన్న‌ట్లుగా మాట్లాడారు.ఆ త‌ర్వాత మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్ లో జ‌న‌సేన‌కు మూడు ఆప్ష‌న్లు ఉన్నాయ‌ని ఇంట్ ఇచ్చారు.

అయితే టీడీపీ కూడా పొత్తుల‌కు ఆహ్వానాలు బ‌హిరంగంగానే చెప్పినా ప‌లానా అని మాత్రం చెప్ప‌లేదు.బీజేపీతో కూడా మొన్న‌టివ‌రకు పొత్తు ఖాయం అని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ప‌దేప‌దే చెప్పారు.

కానీ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా ఏపీలో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ ఉమ్మ‌డి అభ్య‌ర్థిత్వం పై క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో జ‌న‌సేన రూటు మార్చింది.ఇటీవ‌ల కౌలు రైతుల భ‌రోసా యాత్ర‌లో భాగంగా ప్ర‌కాశం జిల్లాలో త‌మ‌కు జ‌నంతో నే పొత్త‌ని చెప్పుకొచ్చారు.

అయినా కూడా ఎక్క‌డో ఒక్క చోట ఎన్నిక‌ల వ‌ర‌కు పొత్తు కుద‌ర‌క‌పోత‌దా.అనే డైలమాలో జ‌న‌సేన ఉంద‌న్న‌ట్లు అంటున్నారు.

Telugu Ap, Chandra Babu, Cmjagan, Janasena, Janasenatdp, Jp Nadda, Pawan, Pawan

పొత్తుల‌కు టీడీపీ సిద్దంగానే ఉన్న‌ప్ప‌టికీ త్యాగాల‌కు సిద్దంగా లేక‌పోవ‌డంతోనే ముందుకు క‌ద‌ల‌లేద‌నేది వాస్తవం.ఇప్ప‌టికైతే జ‌నంతోనే పొత్తు అన్న ప‌వ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో పొత్తు క‌లుపుతార‌నే అంటున్నారు.టీడీపీ కూడా ఎన్నిక‌ల స‌మయానికి ఆలోచిద్దామ‌నే వ్యూహంతో ఉంది.అయితే ఇరు పార్టీల ల‌క్ష్యం వైసీపీకి అధికారం దూరం చేయ‌డ‌మే.ఇక జ‌న‌సేన‌కు ఈ ప‌ట్టు కాస్తా ఎక్కువే అని చెప్పాలి.టీడీపీ కూడా అందువల్ల అటు నుంచే తమ వైపు పొత్తుల ప్రతిపాదనలు వస్తే దాన్ని తనకు అనువుగా మార్చుకుందామన్న వ్యూహంతో బాబు ఉన్నారు.

Telugu Ap, Chandra Babu, Cmjagan, Janasena, Janasenatdp, Jp Nadda, Pawan, Pawan

అయితే ప‌వ‌న్ కూడా టీడీపీ నుంచే పొత్తు ప్ర‌తిపాద‌న రావాల‌ని చూస్తున్నట్లు తెలుస్తోంది.అలా జరిగితేనే తాము కోరుకున్న సీట్లతో పాటు పవర్ షేరింగ్ కి కూడా డిమాండ్ చేయవచ్చు అన్నది జ‌న‌సేన ఆలోచ‌న‌.ఇక ప్ర‌జ‌ల్లో ఉండ‌టానికి బ‌స్సు యాత్ర‌తో ముందుకెళ్తున్నారు.ఈ యాత్ర త‌ర్వాత జనం నాడి తెలుసుకుని పొత్తుల‌పై మ‌రింత క్లారిటీ వ‌చ్చేలా క‌నిపిస్తోంది.అయితే పొత్తు ప్ర‌తిపాద‌న జ‌న‌సేన నుంచి వ‌స్తే త‌మ‌కు అనుకూలంగా ప‌రిస్థితులు ఉండ‌వ‌ని సైలెంట్ గా ఉంంటుంద‌ని అంటున్నారు.అయితే వైసీపీ అధికారంలోకి రావ‌డం జ‌న‌సేన‌కు ఏమాత్రం ఇష్టం లేదు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌నే వ‌స్తాడ‌ని టీడీపీ ఎదురుచూస్తోంది.మ‌రి పవన్ జనంతోనే పొత్తు అన్నాడు కాబ‌ట్టి ఒంటరిగా పోటీకి రెడీ అవుతారో లేక టీడీపీతో చేయి క‌లుపుతారో చూడాలి మ‌రి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube