పెళ్లి అయిన 18 నెలలకే కనిపించకుండా పోయిన వింగ్‌ కమాండర్‌... 47 ఏళ్లుగా ఆ భార్య ఎదురు చూపులు  

Even After 47 Years A Wife Still Waits For Her Fighter Pilot Husband-54 Defense Personnel,damyanti,pilot Husband,vijay Vasant Tambay

ఇండియా పాకిస్తాన్‌ మద్య అర్థ శతాబ్ధం నుండి మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని వేల మంది రెండు దేశాల జనాలు, ఆర్మీ వారు చనిపోయారు. పాకిస్థాన్‌ దేశం అభివృద్దిలో వెనకబడటంతో పాటు, ఉగ్రవాద దేశంగా మారిపోయింది..

పెళ్లి అయిన 18 నెలలకే కనిపించకుండా పోయిన వింగ్‌ కమాండర్‌... 47 ఏళ్లుగా ఆ భార్య ఎదురు చూపులు-Even After 47 Years A Wife Still Waits For Her Fighter Pilot Husband

అదే సమయంలో ఇండియాను ఏదో విధంగా నాశనం చేయాలని పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎప్పుడు దాడులకు తెగ బడుతూనే ఉన్నారు. ఉగ్ర మూకల వల్ల వందలాది మంది ఇండియన్‌ జవాన్‌లు మృతి చెందిన విషయం తెల్సిందే. అయినా పాకిస్థాన్‌ ఉగ్ర మూకలను ఇండియా సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ఉంది.

ఇటీవల రెండు దేశాల మద్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే.

భారత వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ పాకిస్థాన్‌కు చిక్కి మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చిన విషయం తెల్సిందే. అభినందన్‌ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్న ఇండియా, కొన్ని వందలు, వేల మంది ఇంకా కూడా పాకిస్థాన్‌ జైల్లో మగ్గుతున్నారు.

మరి కొందరు అసలు బతికి ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తమ వారు ఉన్నారో లేరో అనే విషయం తెలియక అత్యంత దయనీయ పరిస్థితులను కొందరు ఎదుర్కొంటున్నారు. అభినందన్‌ మాదిరిగానే పాకిస్థాన్‌ వారికి చిక్కిన విజయ్‌ వసంత్‌ తాంబే దాదాపు 47 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ వారికి చిక్కాడు. అప్పటి నుండి అతడి జాడ లేకుండా పోయింది.

విజయ్‌ వసంత్‌ తాంబే పెళ్లి అయ్యి 18 నెలలు. అప్పటికి ఇంకా భార్య, భర్తల మద్య కొత్త మురిపెం అలాగే ఉంది. కొత్త సంసార జీవితాన్ని ప్రారంభించామని వారిద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలోనే విజయ్‌ వసంత్‌ పాకిస్థాన్‌ వారికి పట్టుబడ్డాడు.

ఆ విషయాన్ని రేడియో వార్తలో తెలుసుకున్న విజయ్‌ వసంత్‌ తాంబే భార్య దమయంతి నిశ్చేష్టురాలైంది. ఏం చేయాలో పాలుపోలేదు. అయితే త్వరలోనే భర్త వస్తాడని ఆమె భావించింది..

రోజులు, వారాలు గడిచి పోయాయి, సంవత్సరాలు కూడా గడిచి పోయాయి. ఏకంగా 47 ఏళ్లు అయినా కూడా విజయ్‌ వసంత్‌ గురించి చిన్న జాడను కూడా కేంద్ర ప్రభుత్వం తెలుసుకోలేక పోయింది.

విజయ్‌ వసంత్‌ ఇంకా పాకిస్థాన్‌ జైల్లో ఉన్నాడని దమయంతి ఆశ. అందుకే పాకిస్థాన్‌లోని ఇండియన్‌ ఖైదీలను కలిసేందుకు ఆమద్య ఏర్పాటు జరిగిన సమయంలో వెళ్లేందుకు చాలా ప్రయత్నించింది. కాని ఆమె ఆశ చివరి నిమిషంలో వమ్ము అయ్యింది.

కొన్ని కారణాల వల్ల పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇండియన్‌ ఖైదీలను చూపించేందుకు నిరాకరించింది. అలా 47 ఏళ్లుగా ఆమె భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంది.