కన్నడకు వెళుతున్న థ్రిల్లర్ మూవీ  

Evaru Adivi Sesh Regina Cassandra Kannada - Telugu Adivi Sesh, Evaru, Kannada, Regina Cassandra, Remake

యంగ్ హీరో అడివి శేష్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ హీరో క్షణం చిత్రంతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే.

 Evaru Adivi Sesh Regina Cassandra Kannada

ఆ తరువాత ఎవరు, గూడఛారి వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో టాలీవుడ్‌ను షేక్ చేశాడు ఈ హీరో.పూర్తగా సస్పెన్స్ జోనర్ సినిమాలను తనదైన శైలితో ఆసక్తిగా మలిచి వరుసగా విజయాలను అందుకుంటున్నాడు అడివి శేష్.

ఇక ప్రస్తుతం మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

కన్నడకు వెళుతున్న థ్రిల్లర్ మూవీ-Gossips-Telugu Tollywood Photo Image

అయితే సాధారణంగా అడివి శేష్ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేస్తుంటారు.

తాజాగా ఎవరు సినిమాను కన్నడ భాషలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ సినిమాలో అడివి శేష్ పాత్రలో దిగంత్ నటిస్తాడని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో రెజీనా పాత్ర ఎలాంటి ప్రశంసలు అందుకుందో అందరికీ తెలిసిందే.ఆమె పాత్రను కన్నడలో ఎవరు చేస్తున్నారు అనే అంశం తెలియాల్సి ఉంది.

ఎవరు చిత్రానికి పనిచేసిన చాలా మంది టెక్నీషియన్స్ ఈ సినిమాకు కూడా పనిచేస్తారని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఈ సినిమాను తెలుగులో వెంకట్ రామ్‌జీ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయగా అడివి శేష్ స్వయంగా కథను అందించాడు.

మరి కన్నడలో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Evaru Movie To Be Remade In Kannada Related Telugu News,Photos/Pics,Images..