లాక్‌డౌన్ సడలింపులు: విదేశీ విమానాలకు ఈయూ అనుమతి.. భారత్‌కు మాత్రం నో ఎంట్రీ  

Europe bans entry of us and indian flights amid coronavirus,lockdown,corona virus,Europe, indian,US - Telugu Corona Virus, Europe, Europe Bans Entry Of Us And Indian Flights Amid Coronavirus, Indian, Lockdown, Us

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.దీంతో వివిధ దేశాల ప్రజల మధ్య రాకపోకలు స్తంభించాయి.

 Europe Bans Entry Of Us Indian Flights Amid Coronavirus

అయితే దాదాపు మూడు, నాలుగు నెలలు గడుస్తుండటంతో విమానయాన రంగం పరిస్ధితి దిగజారిపోతోంది.దీంతో కొన్ని దేశాలు సడలింపులు ఇస్తున్నాయి.

తాజాగా పర్యాటకుల కోసం తమ సరిహద్దులను తెరుస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది.ఇదే సమయంలో భారత్, అమెరికా, రష్యా, బ్రెజిల్‌ దేశాలకు చెందిన వారిని మాత్రం అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

లాక్‌డౌన్ సడలింపులు: విదేశీ విమానాలకు ఈయూ అనుమతి.. భారత్‌కు మాత్రం నో ఎంట్రీ-Latest News-Telugu Tollywood Photo Image

దీనికి కారణం లేకపోలేదు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఈ నాలుగు దేశాల్లోనే అత్యధికంగా వెలుగుచూస్తున్నాయి.అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, జార్జియా, జపాన్, మాంటినీగ్రో, మొరాకో, న్యూజిలాండ్ వంటి దేశాలు అనుమతించిన జాబితాలో ఉన్నాయి.ఇక కరోనాకు పుట్టినిల్లైన చైనా విషయానికి వస్తే, తమ దేశాల టూరిస్టులను ఆ దేశం అనుమతిస్తేనే, చైనీయులకు ఈయూ సరిహద్దులు ఓపెన్ చేస్తామని షరతు విధించారు.

ఈ జాబితాలో ప్రతి 14 రోజులకొకసారి మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు.కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు చేస్తున్న కృషిని బట్టి అనుమతి విధించాలా.

లేదా అన్నది ఆధారపడి వుంటుంది.

మరోవైపు యూరోపియన్ యూనియన్‌కు మహారాజ పోషకులు అమెరికన్లే.

ప్రతీ ఏటా సుమారు కోటిన్నర మంది అమెరికన్లు యూరప్ దేశాలను సందర్శిస్తుంటారట.ఐరోపా పర్యాటక రంగంలో అమెరికాకు భారీ వాటా వుంది.

ఇకపోతే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)కి చెందిన విమానాలను వచ్చే 6 నెలల పాటు యూరప్ దేశాల్లోకి అనుమతించరాదని ఈయూ కూటమి నిర్ణయం తీసుకుంది.

#Corona Virus #Lockdown #US #Europe #Indian

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Europe Bans Entry Of Us Indian Flights Amid Coronavirus Related Telugu News,Photos/Pics,Images..