ఎన్నో చర్మ సమస్యలకు చెక్ పెట్టె.... యూకలిఫ్టస్ ఆయిల్     2018-06-22   02:33:00  IST  Lakshmi P

యూకలిఫ్టస్ ఆయిల్ ని ఉపయోగించి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. యూకలిఫ్టస్ ఆయిల్ ని యూకలిఫ్టస్ చెట్టు ఆకుల నుండి తయారుచేస్తారు. ఈ ఆయిల్ మనకు మార్కెట్ లో సులభంగానే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు యూకలిఫ్టస్ ఆయిల్ ని ఉపయోగించి ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

ఒక స్పూన్ ఇప్సమ్ సాల్ట్ లో ఒక స్పూన్ యూకలిఫ్టస్ ఆయిల్ ని కలిపి ముఖానికి పట్టించి స్క్రబింగ్ చేయాలి. ఈ విధంగా చేయటం వలన చర్మంలో మృత కణాలు తొలగిపోతాయి.

ఒక స్పూన్ వేపాకుల పొడిలో సరిపడా యూకలిఫ్టస్ ఆయిల్ ని వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్యలు తొలగిపోతాయి.