ఫేస్‌బుక్ కళ్లద్దాలపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న ఈయూ.. అందుకేనా?

ఫేస్‌బుక్ సంస్థ రే-బాన్ బ్రాండ్ సాయంతో స‌రికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ని లాంచ్ చేసింది.ఇందులో ఫొటోలు సైతం తీసుకొనేందుకు వీలుగా 5 ఎంపీ కెమెరాను అందించింది.

 Eu Strongly Objected To Facebook Smart Glasses Over Privacy Issues, Facebook Sma-TeluguStop.com

అలాగే ఇందులో 30 సెకన్ల వీడియోలను రికార్డు చేసే సామ‌ర్థ్యం ఉంటుంది.ఇంకా క్యాప‍్చరింగ్‌ బటన్‌, ఫేస్‌బుక్‌ అసిస్టెంట్‌ వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా ముట్టుకోకుండానే ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.

అలాగే కాల్స్‌ మాట్లాడొచ్చు.అయితే ఈ స్మార్ట్ గ్లాసెస్‌లోని చిన్న కెమెరా అనేక అనుమానాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.

యూజర్లు ఈ కెమెరా యూజ్ చేసి ఇతరుల అనుమతులు లేకుండా వాళ్ల ఫొటోలు, వీడియోలు తీసే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలోనే యూరోపియన్‌ యూనియన్‌ ప్రైవసీ రెగ్యులేటర్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

ఫేస్‌బుక్ లాంచ్ చేసిన స్మార్ట్‌కళ్లజోడు ప్రజల భద్రత గురించి ఇటలీ ప్రైవసీ విభాగం కూడా పలు సందేహాలు వ్యక్తం చేసింది.ప్రస్తుతం వీటిపై ఐర్లాండ్‌ డాటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ విచారణ చేస్తోంది.

ఇక ఇలాంటి అభ్యంతరాల వల్లే ఫేషియల్‌ ట్యాగింగ్‌ ఫీచర్‌ వాయిదా పడుతూ వస్తోంది.ఫేస్ బుక్ ప్రజల ప్రైవసీకి భంగం వాటిల్లేలా వ్యవహరిస్తోందని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి.

ఇక ఇప్పుడు ఏకంగా ప్రజల వ్యక్తిగత జీవితంలోకి వాక్యం చేసుకునే కళ్ళజోళ్ళు సైతం తయారు చేసిందని కొందరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Telugu Reality, Capacity, Effect, European, Glasses Privacy, Smart Glasses, Late

ఈ విమర్శలపై ఫేస్‌బుక్ అందించింది.అందరూ వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తామని వెల్లడించింది.

ఫేస్‌బుక్ ప్ర‌స్తుతం ప్ర‌వేశ‌పెట్టిన గ్లాస్‌లలో అగుమెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీ వాడలేదు.

ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయం కూడా లేదు.ఇప్పటికే ఫేస్‌బుక్ 20 రకాల కళ్లజోడులు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ఇక తాజాగా తీసుకొచ్చిన రే బాన్‌ స్టోరీస్‌ కళ్లజోడు ధర సుమారు 299 డాలర్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube