కన్నీళ్లు పెట్టించిన జబర్దస్త్ కమెడియన్.. ముక్కు మూసుకుని తినాలంటూ..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిభ ఉన్న కమెడియన్లు జబర్దస్త్ షోలో స్కిట్లు చేసి పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.జబర్దస్త్ షో వల్లే తమకు మంచి గుర్తింపు వచ్చిందని చాలామంది కమెడియన్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

 Etv Sridevi Drama Company Latest Promo Comedian Nookaraju Mind Blowing Performance-TeluguStop.com

జబర్దస్త్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న కమెడియన్లలో నూకరాజు కూడా ఒకరు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా పారిశుధ్య కార్మికుల కష్టాల గురించి నూకరాజు చెప్పుకొచ్చారు.

నూకరాజు తన అమ్మకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పగా తల్లి మన కష్టాలన్నీ గట్టెక్కినట్టేనని చెబుతుంది.ఆ తరువాత మున్సిపాలిటీ జాబ్ అని నూకరాజు చెబుతాడు.

 Etv Sridevi Drama Company Latest Promo Comedian Nookaraju Mind Blowing Performance-కన్నీళ్లు పెట్టించిన జబర్దస్త్ కమెడియన్.. ముక్కు మూసుకుని తినాలంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తరువాత నూకరాజు ఇంటికి వచ్చాక ఏంటిరా ఆ వాసన బురద గుంటలో ఏమైనా పడ్డావా.? అని తల్లి అడుగుతుంది.నూకరాజు నేను పక్కన ఉంటేనే ఉండలేకపోతున్నారని రోజుకు 12 గంటలు అదే కంపులో ఉండాలని నూకరాజు చెప్పుకొచ్చారు.

ముక్కు మూసుకొని అన్నం తింటూ పారిశుధ్య కార్మికులు నిత్య జీవితంలో ఎదుర్కొనే కష్టాలను ప్రజలకు తెలిసేలా చేశారు.

లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనా మున్సిపల్ కార్మికులు మాత్రం విధులు నిర్వహిస్తూ కొంతమంది కరోనా బారిన పడుతున్నారు.మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీలో జంబ లకిడి పంబ స్పూఫ్ చేశారు.రామ్ ప్రసాద్ రోహిణి, హైపర్ ఆది కొత్త అమ్మాయితో చేసిన స్కిట్లు ప్రోమోలో హైలెట్ అయ్యాయి.

రోహిణి రామ్ ప్రసాద్ ను కాలితో తంతూ నవ్వులపువ్వులు పూయించారు.బుల్లెట్ భాస్కర్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాయిస్ లను ఇమిటేట్ చేస్తూ పాడిన పాటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.నూకరాజు పారిశుధ్య కార్మికుల గురించి చేసిన స్కిట్ నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

ఆ షోకు హాజరైన సీరియల్ నటి నవ్యస్వామి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు సెల్యూట్ చేశారు.

#Hyper Aadi #Jabardasth Show #Navya Swamy #MindBlowing #Rohini

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు