కొడుకు వల్ల ఇబ్బందులు పడ్డాను.. నటుడు ప్రభాకర్ కామెంట్స్ వైరల్!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో టీవీ నటుడు ప్రభాకర్ ఆయన తనయుడు చంద్రహాస్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇటీవల నటుడు ప్రభాకర్ తన కొడుకుని హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే.

 Etv Prabhakar About Son Chandrahaas Branded Behavior ,prabhakar , Chandrahas , C-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ని పెట్టి తన కొడుకు గురించి, కొడుకు నటిస్తున్న కొత్త సినిమాల గురించి ప్రకటించాడు.ఇక అప్పటినుంచి ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పై నెటిజన్స్ ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టారు.

సినిమాలలో నటించి హీరోగా అవుదాము అనుకున్న చంద్రహాస్ సినిమాలలోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే ట్రోల్స్ ద్వారా విపరీతంగా పాపులర్ అయ్యాడు.

ఇక ఆ ప్రెస్ మీట్ తిరిగిన తర్వాత నెటిజెన్స్ చంద్రహాస్ పై ఎక్కువగా దృష్టిని పెట్టారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.ఇంటర్వ్యూలో భాగంగా తన కొడుకు పై జరుగుతున్న ట్రోల్స్ పై స్పందించిన ప్రభాకర్ తన కొడుకుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ నెటిజెన్స్ ని తన కొడుకు పై ట్రోల్స్ చేయొద్దు అని వేడుకున్నారు.

అలాగే మీడియాతో ఎలా వ్యవహరించాలి అన్నది పోను పోను తెలుసుకుంటాడు అని చెప్పుకొచ్చాడు ప్రభాకర్.అయితే ప్రెస్ మీట్ లో చంద్రహాసన్ నిలబడటంపై చాలామంది తప్పుపడుతున్నారు.

Telugu Chandrahas, Etv Prabhakar, Prabhakar, Tollywood-Movie

కానీ వాడిని యాక్టింగ్ నచ్చి ఆ తర్వాత తిట్టిన వాళ్లే నెత్తిన పెట్టుకోవచ్చు అంటూ ప్రభాకర్ తన కొడుకు గురించి ధీమా వ్యక్తం చేశారు.అలాగే బ్రాండెడ్ దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల విషయం కుమారుడు చంద్రహాస్ తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చారు ప్రభాకర్.బ్రాండ్ విషయంలో తనకు పెద్దగా పట్టింపు ఉండదని వాడు మాత్రం బ్రాండ్ అయితేనే యూజ్ చేస్తాడని ప్రభాకర్ పేర్కొన్నాడు.గతంలో అమెరికా నుంచి ఓ వాచ్ తీసుకొస్తే.

దాన్ని చూసి ఇది బ్రాండ్ కాదని అన్నాడు.ఈ జనరేషన్ పిల్లలు బ్రాండ్, నాన్ బ్రాండెడ్ వస్తువుల్ని ఇట్లే పసిగట్టేస్తున్నారని ప్రభాకర్ చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube