బూతులకు ఓకే చెప్పేసిన ఈటీవీ.. ఇక జబర్దస్త్‌ కామెడీ పాత దారిలో దూకుడు

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్‌ కి విడతీయ రాని అనుబంధం అనడంలో ఎలాంటి సందేహం లేదు.పదేళ్లుగా జబర్దస్త్‌ ను తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఆధరించారు.

 Etv Mallemala Green Signal To Jabardasth Team Leaders Of Double Meaning Dialogue-TeluguStop.com

ఆధరిస్తూనే ఉన్నారు.అప్పటికి ఇప్పటికి ఆ షో రేటింగ్‌ టాప్ అనడంలో సందేహం లేదు.

అప్పట్లో భారీ రేటింగ్‌ వచ్చినా.ఇప్పుడు కాస్త రేటింగ్‌ తగ్గినా కూడా బుల్లి తెరపై జబర్దస్త్‌ ప్రభంజనం మాత్రం తగ్గడం లేదు.

అత్యంత కీలకం అనుకున్న కమెడియన్స్ వెళ్లి పోయారు.ఎంతో మంది ప్రముఖులు షో కు దూరం అయ్యారు.

అయినా కూడా మల్లెమాల మరియు ఈటీవీ వారు షో ను సక్సెస్ ఫుల్‌ గా తీసుకు వెళ్తున్నారు.షో ప్రారంభం అయిన కొత్తలో డబుల్‌ మీనింగ్ డైలాగ్స్ ను ఎక్కువగా వాడుతూ బూతు షో అంటూ విమర్శలు పొందిన విషయం తెల్సిందే.

అందరూ కూడా మల్లె మాల మరియు టీవీ వారి పై తీవ్ర విమర్శలు చేశారు.పిల్లలు కూడా చూసే ఈ కార్యక్రమం ను ఇలా చూపించడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ తీవ్ర స్థాయి లో విమర్శలు గుప్పించారు.

దాంతో నిర్వాహకులు షో లో బూతులు లేకుండా జాగ్రత్త పడ్డారు.అసలు బూతులు ఉండకుండా జాగ్రత్త పడాలంటూ టీమ్‌ లీడర్ల కు సలహా ఇచ్చారు.అలాంటి బూతులు ఉంటే ఎడిటర్ కి పని చెప్పారు.అలా జబర్దస్త్‌ లో బూతులు ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ కనిపించకుండా పోయాయి.

ఇప్పుడు రేటింగ్‌ కాస్త తగ్గడంతో మళ్లీ మునుపటి జోరు కు వెళ్లాలి అనే ఉద్దేశ్యంతో బూతులకు ఓకే చెప్పారు అంటూ సమాచారం అందుతోంది.అందుకే ఇక నుండి టీమ్‌ లీడర్లు రెచ్చి పోయి మరీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో స్కిట్ లు రాసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube