జబర్దస్త్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌

కరోనా కారణంగా టీవీ షోలు మరియు సీరియల్స్‌ మొత్తం నిలిచి పోయాయి.కొత్త ఎపిసోడ్స్‌ లేక పోవడంతో పాత ఎపిసోడ్స్‌తో నెట్టుకు వస్తున్నారు.

 Bad News For Jabardasth Fans, Coronavirus, Jabardasth, Etv Comedy Show, Tv Serie-TeluguStop.com

ఎట్టకేలకు ప్రభుత్వం నుండి షూటింగ్స్‌కు అనుమతులు రావడంతో మళ్లీ హడావుడిగా షూటింగ్స్‌ మొదలు పెట్టారు.తెలుగు బుల్లి తెరపై మళ్లీ సందడి కనిపించబోతుంది.

సీరియల్స్‌ ఎక్కువగా షూటింగ్స్‌ జరుగుతున్నాయి.కాని కామెడీ షోలు మరియు ఇతర షోలు మాత్రం ఇంకా షూటింగ్‌ జరగడం లేదు.

ముఖ్యంగా జబర్దస్త్‌ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు కొత్త ఎపిసోడ్స్‌ వస్తాయా ఆది పంచ్‌లను మళ్లీ ఎప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలోనే జబర్దస్త్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ను ఇండస్ట్రీ వర్గాల వారు చెప్పారు.జబర్దస్త్‌ షూటింగ్‌కు పెద్ద ఎత్తున కాస్ట్‌ అండ్‌ క్రూ అవసరం అవుతారు.అందుకే షూటింగ్‌కు వెళ్లాలి అంటే జబర్దస్త్‌ టీం కాస్త వెనుక ముందు ఆడుతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Adhi Punches, Coronavirus, Etv Show, Jabardasth, Lock, Tv Shows, Tv Serie

మరికొన్ని రోజుల తర్వాత అన్ని టీమ్స్‌ను ఒకే రోజు కాకుండా రెండు టీంలు ఒక రోజు చొప్పున షూటింగ్‌ చేయాలని నిర్ణయించారు.అలా అయితే జడ్జ్‌ల విషయంలో డేట్లు కుదిరే పరిస్థితి లేదని కొందరు అంటున్నారు.రోజా ఏపీలో రాజకీయాలతో బిజీగా ఉంటుంది.

ఈ సమయంలో ఆమెను ఎక్కువ రోజులు డేట్లు అడగలేని పరిస్థితి.కనుక జబర్దస్త్‌ ఎప్పుడు ప్రారంభం అయ్యేనో తెలియడం లేదు అంటూ మల్లెమాలకు చెందిన వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube