ఆ ప్లేస్‌లో సానియా మీర్జా‌ను తీసేసి సింధుని పెట్టాలంట..!

తెలుగు తేజం టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడి పతకం సాధించడం పట్ల యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది.ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పీవీ సింధు కోసం స్పెషల్ విందు రెడీ చేయించారు.

 Ets Remove Sania Mirza And Put Sindhu In That Place-TeluguStop.com

ఇక ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సింధుకు నగదు బహుమతి ప్రకటించగా, తెలుగు రాష్ట్రాల మంత్రులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సింధును అభినందించారు.సోషల్ మీడియా వేదికగా జనాలు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా, తాజాగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పీవీ సింధు పేరిట తెలంగాణ రాష్ట్ర సర్కారు ముందర సరికొత్త డిమాండ్ ఉంచారు.అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని రీడ్ చేయాల్సిందే.

 Ets Remove Sania Mirza And Put Sindhu In That Place-ఆ ప్లేస్‌లో సానియా మీర్జా‌ను తీసేసి సింధుని పెట్టాలంట..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పీవీ సింధు దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సందర్భంగా ఆమెను తెలంగాణ బ్రాండ్ అబాసిడర్‌గా నియమించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.ప్రస్తుతం తెలంగాణకు అంబాసిడర్‌గా ఉన్న పాకిస్తాన్ దేశ కోడలు సానియా మీర్జాను వెంటనే తప్పించాలని చెప్పారు.

ఆమె స్థానంలో సింధును నియమించాలని సూచించారు.పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌ను సానియా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ విదితమే.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం సింధు పేరు మార్మోగిపోతుండగా, భారతదేశానికి మాత్రమే కాకుండా తెలంగాణకు కూడా పేరు తీసుకొచ్చిన సింధును అంబాసిడర్‌గా నియమిస్తే బాగుటుందని రాజాసింగ్ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు క్రీడీలపై దృష్టి పెట్టాలన్నారు.

తెలంగాణ నుంచి మరింత మంది క్రీడాకారులు రావాల్సిన అవసరముందని, మట్టిలోని మాణిక్యాలను బయటకు తీసి వారికి సరైన శిక్షణ ఇవ్వాలని కోరారు.ఇదిలా ఉండగా పుల్వామా దాడుల సందర్భంలోనూ సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, తాజాగా మళ్లీ అదే డిమాండ్ బీజేపీ ఎమ్మెల్యే ఎత్తుకోవడం గమనార్హం.

తెలంగాణ నుంచి మంచి మంచి క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు రాజా సింగ్.ఇదే అంశం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి జరిగిన సమయంలో కూడా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని డిమాండ్ వినిపించిన సంగతి తెలిసిందే.

#Telengana #Ambbasidor #Raja Singh #PV Sindhu #Saniya Mirza

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు