కొత్త పార్టీనా ... పాత పార్టీనా ? కన్ఫ్యుజ్ అవుతున్న ఈటెల ? 

ఒక వైపు బిజెపిలో చేరిక దాదాపు ఖాయమైపోయింది అనుకుంటున్న సమయంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆలోచనలో పడినట్లు కనిపిస్తున్నారు.ప్రస్తుతం టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న రాజేందర్ త్వరలోనే తన ఎమ్మెల్యే పదవికి , పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.

 Etela Rajendar Confuse Over New Party, Trs, Kcr, Ktr, Etela Rajender, Bjp, Congr-TeluguStop.com

అయితే ఆయన రాజకీయంగా ఎటు వైపు అడుగులు వేస్తారనే విషయంలో ఎటువంటి స్పష్టత రాకపోవడంతో అనేక రకాల విశ్లేషణలు మొదలయ్యాయి.ఇప్పటికే ఆయనకు బీజేపీలో రాజ్యసభ సభ్యత్వం తో పాటు కేంద్ర మంత్రి పదవి,  అలాగే ఈటెల రాజేందర్ భార్యకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అయ్యింది అనే వార్తలు ఒకవైపు వస్తున్నా , రాజేందర్ మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉన్నారు.

సొంత పార్టీ పెడితే ఆ తర్వాత తలెత్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేదానిపై  ఆయన విశ్లేషించుకుంతున్నట్టు తెలుస్తోంది.
 అలాగే బిజెపి , కాంగ్రెస్ ల నుంచి ఆఫర్లు వస్తున్నా,  ఆ పార్టీలో చేరితే రానున్న రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనే విషయంపైన రాజేందర్ ఆలోచన ఉన్నారట.

ఇక సొంత పార్టీ విషయంలోనూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.ఇప్పటికే ఎంతోమంది తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ప్రొఫెసర్ కోదండరామ్ వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలు సైతం నెగ్గుకు రాలేకపోయారు.ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ పెడితే ఏర్పడే ఇబ్బందులను , ఆయన లెక్కల్లో తీసుకుంటున్నారట.

కొత్త పార్టీ పెట్టినా, వేరే పార్టీలో చేరినా,  ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించిన రాజేందర్ టి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో రాజీపడి టిఆర్ఎస్ లోనే కొనసాగితే ఫలితం ఏ విధంగా ఉంటుందనే దానిపైన తనకు అత్యంత సన్నిహితులైన రాజకీయం మిత్రులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో టిఆర్ఎస్ కు రాజకీయ ప్రత్యామ్నాయం చాలా అవసరం.

అయితే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం శక్తిగా గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ ల బలం సరిపోవడం లేదు.

Telugu Bandi Sanjay, Congress, Etela Rajender, Kishan Reddy, Telangana-Telugu Po

ఈ పార్టీలు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రభావం చూపించగలుగుతున్నాయి.ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం ద్వారా తెలంగాణ అంతటా ప్రభావం చూపించవచ్చు అనే ఆలోచన ఒక పక్క రాజేందర్ కు ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని టిఆర్ఎస్ కు ధీటుగా బలోపేతం చేయగలమా అనే సందేహాలు రాజేందర్ లో కనిపిస్తున్నాయి.ఈ సందేహాలు తోనే బిజెపిలో చేరే ఈ విషయంలో ఆలోచన పడ్డట్టు తెలుస్తోంది.

కొత్త పార్టీ పెట్టడం వేరే పార్టీలోకి వెళ్లడం ఈ తలనొప్పుల కంటే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో రాజీపడడమే మంచిది అనే అభిప్రాయాలు రాజేందర్ సన్నిహితుల నుంచి వస్తున్నాయట.ఈ మూడు ఆప్షన్ లలో ఏది ఎంచుకోవాలనే విషయంపై మరికొద్ది రోజులు సమయం తీసుకుని సరైన స్టెప్ వేయాలని రాజేందర్ చూస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube