నిత్య పెళ్లికొడుకు: వయసు 23.. పెళ్లిళ్లు 11.. చివరకు..?!  

eternal groom age 23 marriage 11 finally, 11 marriages, age 23 years, chennai, tamilnadu, love marriages - Telugu 11 Marriages, Age 23 Years, Chennai, Love Marriages, Tamilnadu

ఈమధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచం నలుమూలల నుండి తెలియని వ్యక్తులతో కూడా ఏవేవో సంభాషణలు చేస్తున్నాము.దీంతో దేశాలకు హద్దులు లేకుండా వివిధ దేశాలలో వారి స్నేహితులను ఏర్పరచుకుంటున్నారు.

TeluguStop.com - Eternal Groom Age 23 Marriage 11 Finally

అయితే సోషల్ మీడియాను ఉపయోగించుకొని కొంతమంది మంచి పనులు చేస్తుంటే.మరి కొంతమంది ప్రజలను మోసం చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.

వారి పాపం పండిన తర్వాత వారు కూడా కటకటాల వెనక్కి వెళ్తారు.ఇక అసలు విషయంలోకి వెళితే.

TeluguStop.com - నిత్య పెళ్లికొడుకు: వయసు 23.. పెళ్లిళ్లు 11.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఓ యువకుడు చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తున్నా.కాకపోతే అతను అమ్మాయిలను మోసం చేయడంలో ఆరితేరిపోయాడు.ఇలా అమ్మాయిలను మోసం చేస్తూ నిత్య పెళ్ళికొడుకుగా అవతారమెత్తాడు.ఇలా అతను ఏకంగా పదకొండు మందిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు.11 పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటే అతని వయస్సు ఎంతో ఉందని అనుకుంటున్నారా.? ఎంతో కాదండి.కేవలం 23 సంవత్సరాలు మాత్రమే.చెన్నై నగరంలోని విల్లివాక్కం ప్రాంతానికి చెందిన గణేష్ అనే యువకుడు ఈ పాడు పనులకు శ్రీకారం చుట్టాడు.

తమిళనాడు రాష్ట్రంలోని కొలాత్తూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమలో పడేసి, ఆమెను గత నెల 5వ తేదీన ఇంటి నుంచి పారిపోయి ఇద్దరు వివాహం చేసుకొని చెన్నై నగరంలో ఉంటున్నారు.కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత వారి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయగా.

అదే సమయంలో గణేష్ తన అత్తమామల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఆశ్రయం కల్పించారు.ఈ సందర్భంలో ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి పంచాయతీ పెట్టగా ఈ క్రమంలోనే గణేష్ చేసిన ఘనకార్యాలు మొత్తం బయటికి వచ్చాయి.

దీంతో చివరికి తల్లిదండ్రులతో కలిసి భర్త పై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

#Tamilnadu #Love Marriages #11 Marriages #Chennai #Age 23 Years

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు